Thursday, November 10, 2011

TDS/TCS – చెల్లింపు, రిటర్న్స్


TDS/TCS – చెల్లింపు, రిటర్న్స్

జీతాలు, కమీషన్‌, వడ్డీ, అద్దె, ప్రొఫెషనల్‌ సర్వీసుల కోసం ఫీజు, ప్రవాస భారతీయులు, విదేశీ సంస్థలు వంటి వాటిలో ప్రతి వ్యక్తి నుంచి నిర్ధిష్టమైన కొంత మొత్తాన్ని పన్ను రూపంలో తగ్గిస్తారు. ఆదాయపు పన్ను శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా మొత్తం ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని ప్రతి ఒక్కరూ పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి పన్ను అవసరం లేని వాటికి కూడా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నష్టాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ టీడీఎస్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను రూపంలో తగ్గిన బడిన మొత్తాన్ని బ్యాంక్‌లో జమ చేయడంతో పన్ను చెల్లింపు దారులు పన్ను వాపసు కోసం క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం సరైన TAN నెంబర్‌తో పాటు, సరైన వివరాలతో పాన్‌ నెంబర్‌ను వివరాలను పన్ను చెల్లింపుదారులు అందించాలి.

టీడీఎస్‌ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు
1. సొంత TAN నెంబర్‌ను కలిగి ఉండాలి.
2. అన్ని తగ్గింపులకు సంబంధించిన పాన్‌నెంబర్స్‌
3. చెల్లించాల్సిన పద్ధతులు : కమీషన్‌, వడ్డీ, అద్దె, ప్రొఫెషనల్‌ సర్వీసుల కోసం ఫీజు
4. టీడీఎస్‌ కలెక్షన్‌ పద్ధతులు : Forest Produce, Beverages Corporation etc
5. మినహాయింపులు : తగ్గింపులకు సంబంధించిన సర్టిఫికెట్లు
6. చెల్లించిన స్థూల మొత్తం నుంచి కొంత మొత్తాన్ని తగ్గించాలి. లేకుంటే మొత్తం చెల్లించిన మొత్తాన్ని మినహాయింపుల్లో చూపాలి.
7. ప్రతి వ్యక్తిగత తగ్గింపుల నుంచి తీసివేసిన పూర్తి మొత్తం
8. ప్రతి నెల పూర్తయిన తర్వాత ఏడు రోజుల తర్వాత బ్యాంకుల నుంచి ఆటోమెటిక్‌(ఎలక్ట్రానిక్‌)గా చెల్లించిన మొత్తం
9. అన్ని బ్యాంక్‌ చెల్లింపులకు సంబంధించి మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించాలి.
10. క్వార్టర్లీ టీడీఎస్‌ రిటర్న్స్‌ను త్రైమాసికం ముగిసిన వెంటనే సరైన పాన్‌ నెంబర్‌తో 15 రోజుల్లోగా దాఖలు చేయాలి. టిన్‌ సదుపాయం ఉన్న కేంద్రాల్లోనే వీటిని ఫైల్‌ చేయాలి.
11. అవసరమైతే తగ్గిపులకు సంబంధించి టీడీఎస్‌ సర్టిఫికెట్స్‌ జారీ