Thursday, November 10, 2011

ఆదాయ ఫైలింగ్‌ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆదాయ ఫైలింగ్‌ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Asst. Year : 2011-12 (financial year 01-04-2010 to 31-03-2011)
1. ఫారం 16 (ఒకటి లేదా ఎక్కువ యజమానులు)
2. TDS సర్టిఫికెట్లు
3. బ్యాంకు ఖాతా సంఖ్య (MICR కోడ్‌తో)
4. బీఎస్‌ఆర్‌ కోడ్‌తో పాటు బ్రాంచ్‌ పేరుతో పన్ను చెల్లింపు వివరాలు కలిగిన బ్యాంక్‌ challan నెంబరు
5. చెల్లించిన LIC ప్రీమియంలు: కంపెనీ పేరు, పాలసీ నెఒంబరు, పాలసీ చెల్లించిన తేదీ, హామీ మొత్తం
6. ఫారమ్‌ 16 ప్రకారం ప్రావిడెండ్‌ ఫండ్‌(భవిష్యత్‌ నిధి), ప్రత్యక్ష చెల్లింపులు
7. పిల్లలు స్కూల్ ఫీజు (ట్యూషన్‌ ఫీజు మాత్రమే)
8. హౌజింగ్‌ లోన్‌ (గృహ) చెల్లింపులు (వడ్డీ సర్టిఫికెట్లు : రుణమొత్తం మరియు వడ్డీకి సంబంధించిన వివరాలు వేర్వేరుగా ఉండాలి)
9. సొంత ఇల్లు/ అద్దె ఇంట్లో నివాసానికి సంబంధించిన వివరాలు
10. ఇతర పొదుపునకు సంబంధించిన వివరాలు(ఏ తేదీలో చెల్లించారో వివరాలు)
11. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(మౌలిక సదుపాయాలు) బాండ్స్‌ - చెల్లింపు యొక్క తేదీ
12. ఆరోగ్య భీమా, మెడిక్లెయిమ్‌కు సంబంధించిన పత్రాలు
13. మీ మీద ఆధారపడిన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు (ఖర్చులకు సంబంధించిన వివరాలు ఆధార పత్రాలతో ఉండాలి)
14. విరాళాలకు సంబంధించిన సాక్ష్యాలు, సంస్థ పేరు, ఇనిస్టిట్యూషన్‌ పాన్‌నెంబర్‌, మినహాయింపు సర్టిఫికేట్‌, దాని వ్యాలిడిటీకి సంబంధించిన వివరాలు
15. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు, వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయ వివరాలు.