Monday, November 7, 2011

షికాగోలో టు వాల్‌స్ట్రీట్

షికాగోలో టు వాల్‌స్ట్రీట్

- 1968లోనే ‘పెట్టుబడిపై ముట్టడి’
- షికాగోలో మొదలై..శాంటారోసా, న్యూయార్క్, శాన్‌వూఫాన్సిస్కోకు విస్తరణ
- 1999లో సియాటెల్ ఆక్రమణ
- అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా..
- అయినా లక్ష్యం పెట్టుబడిదారీ విధానాల దుర్నీతే!


seattle talangana patrika telangana culture telangana politics telangana cinemaపెట్టుబడిదారీ వ్యవస్థ అరాచకాలను అంతమొందించాలని, కార్పొరేట్ సంస్థల దురాశ, దుర్నీతి, అవినీతిని అంతమొందించాలని డిమాండ్ చేస్తూ అమెరికాలో కొద్దిమంది ప్రారంభించిన ‘వాల్‌వూస్టీట్‌ను ఆక్రమించండి’ ఉద్యమం రెండు నెలల వ్యవధిలోనే కార్చిచ్చులా ప్రపంచదేశాలన్నిటినీ తాకింది. తాజాగా భారత్‌లోనూ ఈ ఉద్యమం ‘దలాల్ స్ట్రీట్‌ను ఆక్రమించండి’ పేరుతో మొదలైంది. ఈ ఉద్యమం తాకిన 83వ దేశంగా భారత్, 1,501 నగరంగా ముంబై నిలిచింది. ఈ ఉద్యమంతో ప్రభుత్వాలు పడిపోతాయో చెప్పలేంకానీ.. పెట్టుబడిదారీ సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభానికి ప్రతీకగా ఈ ఉద్యమాలు నిలిచాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు పుట్టినిల్లయిన అమెరికాలో.. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి మహోద్యమం ప్రారంభమవడం ఇదే తొలిసారా? కార్పొరేట్ ధనదాహాన్ని దునుమాడుతూ ప్రజలు ఇప్పుడే రోడ్లపైకి వచ్చారా? దాచేస్తే దాగదు కదా!!

‘షికాగో’ ముట్టడి!
పారిక్షిశామిక విప్లవం మలిదశ ప్రారంభంలోనే అంటే 1968లోనే అమెరికాలో తొలి ‘ఆక్షికమణ’ ఉద్యమం జరిగింది! పనిగంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పని ప్రదేశంలో వసతులు కల్పించాలని, యాజమాన్యాల సంకెళ్ల నుంచి స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ సాగిన మహోధృత ఉద్యమానికి చరివూతాత్మక ‘షికాగో’ నగరం వేదికైంది. రెండో ప్రపంచయుద్ధానంతరం అమెరికాలో పాలన అస్తవ్యస్తమైంది. యంత్రాంగంలో సమర్థత లోపించింది. సంక్షేమ కార్యక్షికమాలు నీరుగారాయి. సామాన్యుల పరిస్థితి దారుణంగా తయారైంది. వియత్నాంపై కొనసాగించిన యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పాలనలో ఏర్పడ్డ శూన్యత ఆధారంగా పారిక్షిశామిక సంస్థలు కార్మికులను దోచుకోవడం ప్రారంభించాయి. అమెరికా అంతటా సామాజిక అశాంతి ఆవహించింది. అలజడి మొదలైంది. ఈ తరుణంలో రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అప్పటి అధ్యక్షుడు లిండ్సేజాన్సన్ నిరాకరించడంతో.. పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు అధికార డెమొక్షికటిక్ పార్టీ షికాగోలో ఆగస్టు 26-29 మధ్య జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. అయితే.. అప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన ప్రజలు 28వ తేదీన సదస్సు జరుగుతున్న ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ‘గ్రాంట్ పార్క్’లో సాయంత్రం 3.30 గంటలకు ఓ చిన్నారి దేశ పతాకాన్ని చేతపట్టుకుని ముందునడవగా దాదాపు 10 వేల మంది ‘సభాస్థలి’ ముట్టడికి ప్రయత్నించారు.

‘ప్రజలను పట్టించుకోండి.. దోపిడీని నివారించండి’ అని పెద్ద పెట్టున నినదిస్తూ కదం తొక్కారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో ర్యాలీ హింసాత్మకంగా మారింది. భాష్పవాయుగోళాలు, నీటి ఫిరంగులతో ప్రదర్శనకారులపై విరుచుకుపడడంతో అనేక మందికి గాయాలయ్యాయి. దాదాపు 7,500 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో దేశమంతా అట్టుడికిపోయింది. పారిక్షిశామిక దోపిడీకి చిరునామాగా నిలిచిన కేంద్రస్థానాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఉత్తర కాలిఫోర్నియా రాష్ట్రం సొనొమా కౌంటీలోని ‘శాంటారోసా’ మహానగరాన్ని ఆక్రమించేందుకు లెక్కలేనన్ని ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో శాంటారోసా జనాభా 1.65 లక్షలు. దేశంలోనే ఆరవ అతి పెద్ద నగరం. ఇలాంటి ఆక్రమణలే ప్రముఖ నగరాలైన ఓక్‌ల్యాండ్, న్యూయార్క్, శాన్‌వూఫాన్సిస్కోలోనూ కొనసాగాయి. అయితే ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగితే ప్రస్తుత ‘వాల్‌వూస్టీట్‌ను ఆక్రమించండి’ ఉద్యమంలో ప్రధానంగా వినిపిస్తున్న ‘వీ ఆర్ ది 99 పర్సెంట్ (మేం 99 శాతం మంది ప్రజలం)’ అన్న నినాదం అప్పుడే నిజమయ్యేది.

సియాటెల్ ముట్టడి!
1947లో ప్రారంభమైన సుంకాలు, వాణిజ్య సాధారణ ఒప్పందం (గాట్)... 1995, జనవరి ఒకటిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ-ఎల్‌పీజీ) పునాదులపై ప్రపంచవాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)గా అవతరించింది. వాస్తవానికి అగ్రదేశాల నయా వలసవాద విధానానికి ఈ సంస్థ ప్రతిరూపం. సంస్థ ప్రారంభమైన తొలినాళ్లలోనే ఎల్‌పీజీ విధానాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కనిపించింది. ప్రభుత్వరంగ పరిక్షిశమలను ధ్వంసం చేయడం, వాటికి ఇచ్చిన రిజర్వేషన్లు, రాయితీలను తొలగించడం, చాలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించడం, ప్రైవేటు రంగంలో మితిమీరిన పోటీకి వీలు కలిగించి, విదేశీ బడా పారిక్షిశామిక కంపెనీలను అనుమతించి, స్థానిక, దేశీయ పరిక్షిశమలు చితికిపోయేలా చేయడం, లక్షలాది మంది కార్మికులను, సిబ్బందిని వీధులపాలు చేయడం, విదేశీ, స్వదేశీ బడా పరిక్షిశమల గుత్తాధిపత్యంతో నిత్యావసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి నియంవూతణ చర్యలే లేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వాణిజ్య విధానాలను మరింత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో 1999, నవంబర్ 30న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ‘మినిస్టీరియల్ సమావేశం’ నిర్వహించింది. అయితే.. పునాది లేకుండా నిర్మిస్తున్న పేకమేడలపై అప్పుడే ఆందోళన రాజుకుంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే పేరుతో సంక్షేమ కార్యక్షికమాలకు నిధులు తగ్గించడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందుకు అమెరికన్లు కూడా మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో.. ‘సియాటెల్ ముట్టడి’కి సామాజికవాదులు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వందలాది మంది సియాటెల్ చేరుకుని సమావేశ కేంద్రాన్ని ముట్టడించారు.

అయితే.. 1968తో పోలిస్తే 1999నాటికి అమెరికా సైన్యం మరింతగా శక్తిమంతమైంది. దీంతో ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేసింది. సమావేశం జరగుతున్న ‘వాషింగ్టన్ స్టేట్ కన్వెన్షన్, ట్రేడ్ సెంటర్’ యుద్ధభూమిని తలపించింది. యుద్ధట్యాంకులను ఆ ప్రాంతంలో మోహరించడమే గాక ఆందోళనకారులను చెల్లాచెదరు చేసేందుకు అమెరికా ఏకంగా సైనిక హెలిక్యాప్టర్లను కూడా వినియోగించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.‘ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే.. ప్రపంచ దేశాల్లో ప్రజాసామ్యం పరిఢవిల్లేందుకు ఎంతో కృషి చేసే’ అమెరికా ఈ రెండు ఆక్రమణలను అత్యంత హింసాత్మక పద్ధతుల్లో అణచివేయగలింది. కానీ.. తాజా ‘వాల్‌వూస్టీట్‌ను ఆక్రమించండి’ ఉద్యమం మాత్రం చాలా శాంతియుతంగా జరుగుతోంది. అందువల్లే ఉద్యమానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సంఘీభావం తెలపాల్సి వచ్చింది.