Thursday, November 10, 2011

ఆదాయపు పన్ను రీఫండ్స్‌


ఆదాయపు పన్ను రీఫండ్స్‌

అదనంగా చెల్లించిన మొత్తాన్ని పన్ను చెల్లింపుదారునికి తిరిగి చెల్లించడానికి ఆదాయపు పన్ను శాఖ కొన్ని పద్ధతులను పాటిస్తుంది.
1. ముందస్తు పన్ను : స్వచ్ఛందంగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే ముందస్తు పన్ను
2. టీడీఎస్‌ : పన్ను చెల్లింపుదారుడు క్లెయిమ్‌ చేసుకున్న మొత్తాన్ని పరిశీలించి పన్ను మొత్తాన్ని తగ్గించి ఆదాయపు పన్ను శాఖ తిరిగి చెల్లించటం.
3. టీసీఎస్‌ : పన్ను చెల్లింపుదారుని నుంచి పరిగణనలోకి తీసుకొన్ని మొత్తాన్ని సేకరించటం.
రీఫండ్‌ క్లెయిమ్‌ కోసం పాటించాల్సిన పద్ధతులు :
1. ఇన్‌కమ్‌ రిటర్న్స్‌ : పూర్తి ఆదాయానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఆదాయానికి సంబంధించిన ఫైల్‌ను రిటర్న్‌ చేయాలి.
2. పన్ను చెల్లింపులు : పన్ను చెల్లింపుదారులు బీఎస్‌ఆర్‌ కోడ్‌, సరైన పాన్‌ నెంబర్‌తో పన్ను చెల్లించాలి.
3. పన్నుల తగ్గింపు : పన్ను చెల్లింపుదారులు పూర్తి ఆదాయంపై ట్యాక్స్‌ చెల్లిస్తారు. పన్ను చెల్లింపుదారులు ఫారం 26ఎఎస్‌ను పూర్తి చేసి ఆదాయపు పన్ను శాఖకు సరైన పాన్‌ నెంబర్‌తో దాఖలు చేయాలి. దీనిని పరిశీలించి ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్‌లో కొంత మొత్తాన్ని తగ్గించి తిరిగి చెల్లిస్తుంది.
4. టీసీఎస్‌ : పన్ను చెల్లింపుదారుని ఆదాయం నుంచి పరిగణనలోకి తీసుకున్న శాతంతో కొంత మొత్తాన్ని ట్యాక్స్‌ కలెక్టర్‌ సేకరిస్తాడు. తిరిగి ఆ మొత్తంలో నుంచి కొంత భాగాన్ని టీడీఎస్‌ రిటర్న్‌ దాఖలు చేయడం ద్వారా సరైన పాన్‌ నెంబర్‌, ఆదాయపు పన్ను శాఖ ఫారం 26ఎఎస్‌తో తిరిగి పొందవచ్చు.
5. ప్రక్రియ : ఆదాయం పన్ను శాఖ TDS / TCS దాఖలు చేసిన తర్వాత బ్యాంక్ రికార్డులతో పన్ను చెల్లింపులను ధ్రువపరుస్తారు. ఆదాయపు పన్నును తిరిగి చెల్లించడం కోసం దరఖాస్తును పరిశీలించి ఆదాయంను రిటర్న్‌ ఆఫ్‌ ప్రాసెస్‌ చేస్తారు.