Thursday, November 10, 2011

ధరలు

ధరలు

ఆవశ్యక వస్తువులు, కూరగాయలు, వంటసరుకులతో సహా అన్ని వస్తువుల ధరలు ప్రస్తుతం భారీగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం వినియోగవస్తువులన్నీ వినియోగదారుల డిమాండ్‌, సరఫరాల్లో ఉన్న తేడాలే. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా వస్తువుల సరఫరా లేకపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అందువల్ల ధరల అదుపునకు సరైనా విధివిధానాలను కేంద్రం అవలంభించాలి. కావాలని కృత్రిమ కొరతను సృష్టించే కంపెనీలపై దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలి. దీంతో ధరల పెరుగుదల కొంత మొత్తంలో అరికట్టవచ్చు.

1. పెట్రోలియం ఉత్పత్తులు:
విదేశీ మారకం రేట్లలో మార్పులు, అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదల కారణంగా పెట్రోలియం కంపెనీల నష్టాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచుతూ వస్తోంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ధరలు పెరిగిన ప్రతిసారి దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచే ప్రభుత్వం, తగ్గినప్పుడు మాత్రం ధరలను తగ్గించడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే గతంలో ఆయిల్‌ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయని, దీనిని రికవరీ చేయడానికి ధరలను తగ్గించడం లేదని కేంద్రం ప్రకటిస్తోంది. అయితే నష్టాలు పూడ్చుకున్న తర్వాత కూడా ప్రభుత్వం ధరలను తగ్గించడానికి వెనుకంజ వేస్తోంది.

అయితే ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్చలు చేపట్టవచ్చు. దేశీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల శాతాన్ని తగ్గించవచ్చు. ఉదాహరణకు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.3 పెరిగిందనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం సుకం రూపంలో వసూలు చేసే పన్నుతో రిటైల్‌ మార్కెట్లో ఈ ధర మరింత పెరుగుతుంది. పెట్రో ధరలు పెరిగితే పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా అమాంతం పెరుగుతుంది. ఇది వినియోగదారులకు అదనపు భారంగా చెప్పవచ్చు. సుంకం నిర్ణీత మొత్తంలో ఉండాలి తప్ప పర్సెంటేజీ లెవల్స్‌లో ఉంటే వినియోగదారులు మరింత నష్టపోతారు. ధరలు ఎప్పుడు గిట్టుబాటు ధర, వినియోగదారు ధరల్లో ఉండాలి. అంతేకాని నిర్దిష్ట పర్సెంటేజీలో ఉంటే జనం పన్నుల రూపంలో మరింత డబ్బును కోల్పోవాల్సి వస్తుంది.

2. ఆవశ్యక వస్తువుల:
మార్కెట్లో డిమాండ్‌, సరఫరాల ఆధారంగా ఆవశ్యక వస్తువుల ధరలు నిర్ణయించబడుతున్నాయి. సరఫరాల్లో ఆసల్యం, గోదాముల్లో అక్రమ నిల్వలతో ఆవశ్యక వస్తువుల ధరలను మరింత పెంచుతున్నాయి. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ప్రస్తుతం మన దేశంలో చైన్‌ సిస్టమ్‌ ఉండటంతో రైతుల కన్నా దళారులు ఎక్కువగా లాభపడుతున్నారు. సీజన్‌లో ప్రభుత్వం మద్దతు ధరను తక్కువగా నిర్ణయించడంతో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు.

వినియోగదారుని కొనుగోలు శక్తి పెరగడంతో ధరలు పెరిగాయని చెప్పడం పెరిగాయని చెప్పడం కరెక్ట్‌ కాదు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వినియోగదారులు కొన్ని వస్తువులను తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందువల్ల ముఖ్యమైన వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయాలు ధరల అదుపునకు కృషి చేయాలి.