Thursday, November 10, 2011

విదేశాల్లో నగదు డిపాజిట్లు

విదేశాల్లో నగదు డిపాజిట్లు

అక్రమమని తెలిసినా ఎంతో మంది భారతీయులు స్విట్జర్లాండ్‌, జర్మనీతో పాటు అనేక దేశాల్లోని బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్‌ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి డిపాజిట్లకు సంబంధించిన హక్కులు వచ్చాయి. అయితే అధిక పన్నుల భారంతో అనేకమంది భారతీయులు డబ్బును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న పన్ను రేట్లే కాకుండా ఇతర కారణాలు కూడా విదేశీ బ్యాంకు డిపాజిట్లకు కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక సంతతను కలిగి ఉన్న విదేశీ బ్యాంకుల్లో డబ్బు జమ చేయడానికి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. డిపాజిట్లకు సంబంధించిన ప్రధాన కారణాలను విశ్లేషించలేకపోయినప్పటికీ ఆయా దేశాల్లోని చట్టాల లోసుగుల ఆధారంగా భారతీయులు డబ్బును డిపాజిట్‌ చేస్తున్నారు.

నల్లధనాన్ని అక్రమమైన పద్ధతుల్లో విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన కారణంగా ఎత్తి చేపింది. విదేశాల్లా అలాంటి డిపాజిట్ల ఫలితంగా ప్రతి ఏటా మన దేశానికి పన్ను రూపంలో ఆదాయం చాలా తగ్గుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే దీనిని పన్ను కోణంలో చూడకుండా అక్రమాలను అరికట్టే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని తెలిపింది.

విదేశాల్లోకి భారీగా నిధులు బదిలీ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల చెల్లింపులపై ప్రభుత్వం విశ్వసనీయత కలిగి ఉండదు. లావాదేవీల్లో పారదర్శకత లేకపోతే ఎప్పుడూ ప్రభుత్వానికి అనుమానం వస్తుంది. దీన్ని తప్పించుకోవడానికి ఎక్కువ మంది డబ్బును విదేశాల్లో డిపాజిట్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే బదిలీ అవుతోన్న నిధుల్లో ఇందులో 3-4 శాతం కేసులే నమోదు అవుతున్నాయి.

పన్ను ఎగవేతను తగ్గించడానికి ఎన్‌డీయే ప్రభుత్వం 2004లో కీలక నిర్ణయాలను తీసుకుంది. పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత కల్పించడానికి వివిధ అధికారాలతో ఎలక్ట్రానిక్‌ రూపంలో “ANNUAL INFORMATION RETURN”ను పరిచయం చేసింది. ఇది సక్సెస్‌ కావడంతో కొంతలో కొంత నల్లధనం విదేశీ బ్యాంకులకు చేరకుండా అరికట్టగలిగినట్లైంది.

అయితే 2004 నుంచి ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వం దీనిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. పన్ను చెల్లింపుదారుల నుంచి సరైన పన్నును వసూలు చేసేందుకు ఉన్న వార్షిక సమాచారాన్ని ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైంది. తగిన ప్రణాళికలతో వివిధ విభాగాల ద్వారా వార్షిక సమాచారాన్ని తీసి వినియోగించి ఉంటే పన్ను ఎగవేత తగ్గడంతో పాటు అక్రమవైన పద్ధతుల్లో విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గేవి.

విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ప్రాముఖ్యత ఇవ్వడం సముచితమైనదే కాని ఆయా దేశాల్లో బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వివరాలు బహిర్గత పరచకుండా రహస్యత పాటించడం మన దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుంది. చట్ట విరుద్ధంగా సంపాదించిన ధనం ఇతర దేశాలకు తరలకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను ఇప్పటికే కుదుర్చుకోవడంతో నల్లధనం వెలికితీతకు సంబంధించి వివరాలు వెలికితీతకు భారత ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

దేశంలోకి నల్లధనాన్ని తిరిగి ఎలా తీసుకురావాలంటే...
- విదేశాల్లో జమచేసిన డబ్బుకు తగిన పన్నులు చెల్లిస్తే దానిని దేశంలోకి అనుమతించాలి.
- డబ్బుపై ఏమైనా అనుమానాలుంటే వాటిని బిగపడతామని(హోల్డ్ చేస్తామని‌) విదేశాలను ఒప్పించాలి.
- డిపాజిట్లకు సంబంధించి పారదర్శకత లేకపోతే ఆ వివరాలు వెల్లడించాలని విదేశాలను కోరాలి.
- ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించారని విదేశాలను హెచ్చరించాలి. నల్లధనానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలతో విచారించాలి.
- డిపాజిట్లకు సంబంధించి విదేశాలను బాధ్యులను చేయాలి.
- డిపాజిట్లలో పారదర్శకత ఎందుకు పాటించలేదు. డిపాజిటర్లను అలాంటి డిపాజిట్లు ఎందుకు చేశారో తెలపాలని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో పారదర్శక ఉంటుందని, గోప్యం ఉండదని డిపాజిటర్లకు సమాచారం ఇవ్వాలి.
- పన్ను చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి అక్రమ డిపాజిట్లను అరికట్టవచ్చు.
- కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తే డిపాజిటర్లలో భయం నెలకొని ఉంటుంది.
పైన చెప్పిన సూచనలు యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రిటర్స్‌పై ఆధారపడి చేసినవి. ఈ సమాచారం ప్రతిపాదనల కోసం మాత్రమే.