Thursday, November 10, 2011

ఆర్థిక సంక్షోభం

ఆర్థిక సంక్షోభం

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. సంక్షోభం తర్వాత చాలా కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. వాణిజ్య కంపెనీలు ప్రచార వ్యయంతో పాటు అనవర వ్యయాన్ని తగ్గించుకుని సంస్థపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడకుండా కాపాడుకుంటున్నాయి.
వృధా తగ్గింపు, ఉత్పాదకత, పొదుపు మెరుగుపరిచే దశలను తెలుసుకుందాం.
వాణిజ్య సంస్థలు ద్వారా :
- ప్రకటన మరియు ప్రచారపు ఖర్చును భారీగా తగ్గించాలి.
- ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉత్పాదకత పెంచాలి.
- అమ్మకం ధర, ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించాలి.
- అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్‌ సిబ్బందిని తగ్గించాలి.
- అధిక లాభాలు ఇచ్చే ఉత్పత్తిపై మాత్రమే దృష్టి పెట్టాలి.
వినియోగ వస్తువులు కోసం ప్రకటన, మార్కెటింగ్ వ్యయాన్ని వీలైనంత తగ్గించాలి లేదా పూర్తిగా నిషేధించాలి. నాణ్యత, పరిమాణం, ధర ఏకరీతిలో ఉండాలి. ఈ నియమాలను పాటిస్తే మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే సంస్థల్లో ఒకటిగా కంపెనీ నిలుస్తుంది. పెట్టే ప్రతి ఖర్చుకు ముందు కొన్ని నియమాలను పాటిస్తే మంచిది.
A. ఈ ఖర్చు అవసరమా?
B. దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? ఉంటే దీనికన్నా తక్కువ ఖర్చు అవుతుందా? లేదా?
C. ఇదే వ్యయంతో ఎక్కువ ఉత్పాదకతను పొందే ఆస్కారం ఉందా?
D. ఈ వ్యయం ద్వారా ఏమైనా లాభాలు వచ్చే ఛాన్స్‌ ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంటాయి?
- నాణ్యతను మెరుగుపరిచేందుకు సంస్థలు ప్రయత్నించాలి. అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే బదులు అడ్వటైజ్‌మెంట్‌, ఉచితం, నమూనాలు, మార్కెటింగ్‌ వ్యయాన్ని తగ్గించాలి. ధరలను తగ్గించి అమ్మకాలను మెరుగు పరచడానికి ప్రయత్నించాలి.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో తమ కంపెనీని పోల్చి చూసుకోవాలి. ఆ సంస్థలతో పోల్చి చూసుకుంటే కంపెనీ అనవసర ఖర్చులు భారీగా తగ్గుతాయి. అలాగే ఉత్పాదకతను మెరుగుపర్చడానికి కీలక నిర్ణయాలను తీసుకోవాలి.
- ఉన్నత ప్రమాణాలతో నాణ్యత ఉండాలి. తరచుగా నాణ్యతపై తనిఖీ నిర్వహించి తగు సూచనలు ఇవ్వాలి.
- బడ్జెట్‌, వాస్తవిక గణాంకాల మధ్య ఉన్న గ్యాప్‌ను అన్ని సూక్ష్మ స్థాయిల్లోనూ తగ్గించాలి. ఈ గ్యాప్‌ను తగ్గించడానికి వెంటనే చర్యలు చేపట్టాలి.
- అదే బ్రాండ్‌ పేరుతో సెకండ్‌ క్వాలిటీ వస్తువులను అమ్మరాదు. ఇది సంస్థ ఇమేజ్‌ను నాశనం చేస్తుంది. దీంతో పాటు వినియోగదారులను మోసగించినట్టు అవుతుంది. దీనిద్వారా అమ్మకాలు తగ్గడంతో పాటు ఒక్కోసారి న్యాయపరమైన చర్యలకు అవకాశం ఉంటుంది.
- జవాబుదారీని కలిగి ఉండాలి. ఏదైనా పొరపాటు జరిగితే దానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే సమస్య రాకుండా ఉండేందుకు సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చి ఇతరులెవరికీ జవాబు చెప్పవలసిన అవసరం లేకుండా తీర్చిదిద్దాలి.
- మెరుగైన నాణ్యత, తక్కువ ధర, ఉత్పాదకత కంపెనీకి పేరు ప్రఖ్యాతులను సంపాదించి పెడుతుంది. దీనిద్వారా కంపెనీ లాభాల్లో వృద్ధిని సాధిస్తుంది.
- నిపుణులు, చుకుకైన సిబ్బందిని తీసుకోవాలి. ఏ ఉద్యోగానికి ఎవరు అతికినట్టు సరిపోతారో వారికి అవకాశం ఇవ్వాలి.
- వ్యయంపై తరచు విశ్లేషణ జరపాలి.
- చక్కగా, సమర్థవంతంగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాలి. వారిని గుర్తించి వీలైతే అవార్డులను ప్రకటించాలి.
- వృధాని అరికట్టి, ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయాలి. అలాగే సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి.
- బ్రాండ్‌ ఇమేజ్‌ కోసం నాణ్యత, పనితీరు, ఉత్పాదకత కోసం పోటీ పడుతూ ఉండాలి
- సంస్థ యొక్క నిర్వహణ మేనేజ్‌మెంట్‌ చేతిలో ఉండకుండా వృత్తిపరంగా నిపుణులైన వారి చేతుల్లో ఉంటే మంచిది.
- పెట్టుబడి, మేనేజ్‌మెంట్‌ వేర్వేరుగా ఉండాలి. పెట్టుబడిదారులు నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండరు.
- వ్యయ నియంత్రణను కవర్‌ చేసేలా ఆడిటింగ్‌ ఉండాలి. వనరులను సమర్థవంతంగా నిర్వహించి ఉత్పాదకతను పెంచి ఎక్కువ లాభాలను పెంచేలా ఉండాలి. ఆడిటింగ్‌ అనేది ఒక 'పోస్ట్‌మార్టం'లా ఉండకూడదు.

కార్పొరేట్‌ నష్టంతో వాటాదారులు ఇబ్బందులకు గురిచేస్తుంది. దాంతో వారు ఈ క్రింది నష్టాలను చవిచూస్తారు.
A. వనరుల వృధా
B. సిబ్బంది అసమర్ధతతో తక్కువ ఉత్పాదకత
C. రుణదాతలు, ఆర్థిక సంస్థలకు నష్టం
D. వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్‌కు నష్టం
E. వ్యవస్థ, పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది
F. సంస్థ పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.
G. అంతర్జాతీయంగా కంపెనీకి చెడ్డ పేరు తెస్తుంది
H. ప్రభుత్వానికి తగ్గనున్న పన్నుల వసూళ్ళు
I. ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం
J. నికర సంపద నిర్వీర్యం అవుతుంది
K. నష్టాలు చవిచూస్తే కొత్తగా ఏ సంస్థను, పరిశ్రమను పెట్టినా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇబ్బంది ఎదురవుతుంది.