Thursday, November 15, 2012

గోల్డ్ ఈ టి ఎఫ్ లలో పెట్టుబడి పెట్టడం లాభామా ?

గోల్డ్‌ ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ను మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తాయి. ఈ ఇ.టి.ఎఫ్‌ ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని బంగారంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వినియోగిస్తారు. నేరుగా బంగారంలో ఇన్వెస్ట్‌ చేయకుండా ఇ.టి.ఎఫ్‌ లలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయాలి అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.

ఫిజికల్‌ గోల్డ్‌ కొనుగోలుతో పోలిస్తే, ఇ.టి.ఎఫ్‌ రూపంలో అయితే ఎవరూ దొంగిలించే వీలుండదు, ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫ్‌గా వుంటుంది అన్నది ప్రధానమైన కారణం, ఇక ఇ.టి.ఎఫ్‌ లు గోల్డ్‌లో ట్రేడింగ్‌ కూడా చేస్తాయి కాబట్టి, రిటర్న్స్‌ కొంతమేరకు ఎక్కువగా వుంటాయి అన్నది రెండవ ప్రధాన కారణం. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ వీక్‌ అవుతూ వుండడం, ఇన్వెస్ట్‌మెంట్‌ డిమాండ్‌ పెరుగుతూ వుండడం వంటివి బంగారం పెట్టుబడులకు సంబంధించిన అనుకూలాంశాలు.

భారత్‌లో గోల్డ్‌ ఇటిఎఫ్‌ లు నిర్వహిస్తున్న ఆరు మ్యూచువల్‌ ఫండ్స్‌:
1. బెంచ్‌మార్క్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
2. యుటిఐ మ్యూచువల్‌ ఫండ్‌
3. కోటక్‌ మహాంద్రా మ్యూచువల్‌ ఫండ్‌
4. రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
5. క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌
6. యస్ బి ఐ మ్యూచువల్‌ ఫండ్‌.

ఈ ఆరు ఎక్స్‌ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌, ట్రేడ్‌ చేస్తాయి కాబట్టి ఏ స్కీములో ఇన్వెస్ట్‌ చేసినా, ఒకటే తరహా రిటర్న్స్‌ లభిస్తాయి.

గత ఏడాది వ్యవధిలో ఈ ఆరు గోల్డ్‌ ఇటిఎఫ్‌ల లోనూ సుమారు 27 శాతం రాబడి గిట్టుబాటు అయింది. యుటిఐ గోల్డ్‌ ఇటిఎఫ్‌ లో రెండేళ్ళ రాబడి 67 శాతం వరకు వచ్చింది.అంతర్జాతీయ గోల్డ్‌ ఇటిఎఫ్‌ ల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశాలు వున్నాయి,అంతర్జాతీయ ఫండ్స్‌లో గత ఏడాది డిఎస్‌పి బ్లాక్‌రాక్‌ వరల్డ్‌ గోల్డ్‌ ఫండ్‌, ఎఐజి వరల్డ్‌ గోల్డ్‌ ఫండ్స్‌ 35 శాతం రాబడి ఇచ్చినవి. కాబట్టి గోల్డ్‌ ఇటిఎఫ్‌ లను తప్పని సరిగా, మీ పోర్ట్‌ఫోలియోకి జత చేసుకోండి. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 శాతం గోల్డ్‌ ఇటిఎఫ్‌లకు కేటాయించండి. అలాగే ఈ గోల్డ్‌ ఇటిఎఫ్‌లలో స్వల్ప కాలిక లాభాల కంటే దీర్ఘకాలిక లాభాలకోసమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
(మన-ఆంధ్ర.కాం)