Tuesday, November 20, 2012

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి..?

మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ లేదా బ్యాలె‌న్స్డ్‌ కూడా కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ ఋణ పత్రాలలో, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో కూడా పెడతాయి. అందువల్ల షేర్ల ద్వారా వచ్చే రిస్క్‌ని గణనీయంగా తగ్గించుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బుని మొత్తం షేర్లలోనే పెట్టదు. అందులో 50% షేర్లలో కొనడం, మిగతాది ఋణపత్రాల్లో పెట్టడం వల్ల మన రిస్క్ గణనీయంగా తగ్గే అవకాశం వుంది. ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒక్కో ట్రస్ట్‌గా ఏర్పడి ఎంతోమంది మదుపుదారుల నుండి డబ్బుని సేకరించి వారి తరపున పెట్టబడులను నిర్వహిస్తాయి. ఇలా వచ్చిన పెట్టుబడులనే నిధి(ఫండ్) గా వ్యవహరిస్తారు. అందుకే వాటికి మ్యూచువల్ ఫండ్ (సమిష్టి నిధి)గా షేరు వచ్చింది.

మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు:

తక్కువ పెట్టుబడి: ఒక కంపెనీ షేర్లను కొనాలంటే మీరు రూ.25,000 పెట్టుబడి పెట్టాలి. కాని మీ దగ్గర కేవలం రూ. 1000 మాత్రమే వున్నాయి. అయినా ఆ కంపెనీ షేర్లలో సైతం మీరు పరోక్షంగా భాగస్వామి కావచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

మ్యూచువల్‌ పంఢ్స్‌లో మనం కేవలం షేర్లలోనే కాక, వివిధ రకాల కంపెనీ డిపాజిట్లు. ప్రభుత్వ రుణపత్రాలు, ట్రజరీ బిల్లులు మొదలైన వాటిలో సైతం భాగస్వాములం అవుతాం. అందువల్ల ఒక షేర్‌ విలువ తగ్గిపోయినా, ఇతర షేర్లు, రుణపత్రాల ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం వుంటోంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా కాక యూనిట్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం వుంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాలు:


ఓపెన్ ఎం‌డెడ్ ఫండ్స్
క్లోజ్ ఎం‌డెడ్ ఫండ్స్
ఈక్విటీ ఫండ్స్
డెట్ ఫండ్స్
బ్యాలె‌న్స్‌డ్ ఫండ్స్

(తెలుగు వన్ఇండియా)