Tuesday, November 20, 2012

ట్రేడర్, ఇన్వెస్టర్ మధ్య ఉన్న తేడా ఏమిటి..?

మన దైనందిన జీవితంలో చాలా సార్లు ట్రేడర్, ఇన్వెస్టర్ అనే పదాలను వినే ఉంటాం. కానీ షేర్ల విషయానికి వస్తే ఈ రెండు పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. అదేంటో క్షణ్ణంగా తెలుసుకుందాం..

ఇన్వెస్టర్ (పెట్టుబడిదారు): లాంగ్ టర్మ్ ఇన్వెస్టమెంట్ (ఉదాహారణకు 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాలు) కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారిని ఇన్వెస్టర్లు అని అంటారు. ఇన్వెస్టర్లు "buy and hold" పాలసీ ద్వారా ఆస్తులు, వస్తువుల మొదలగున వాటిల్లో పెట్టుబడి పెడతారు. రిస్క్ మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకోని ప్రాథమిక విశ్లేషణ ద్వారా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయం తీసుకుంటారు. దీర్ఘకాలిక కాలపరిమితి బట్టి పెట్టుబడిదారుల పెట్టిన పెట్టుబడి రిటర్న రూపంలో వస్తుంది.

ట్రేడర్ (వ్యాపారి): ట్రేడర్స్ అంటే స్పెక్యులేటర్లు. వీరి షేర్లు షార్ట్ టర్మ్ (కొన్ని నిమిషాలు, కొద్ది రోజుల) పాటు మాత్రమే ట్రేడ్ అవుతాయి. వీరి విధానం అస్పష్టంగా మరియు తక్షణంగా ఉంటుంది. న్యూస్, రిపోర్ట్స్, సాంకేతిక విశ్లేషణ ద్వారా వీరు నిర్ణయాలు తీసుకుంటారు. తక్కువ కాలంలో మార్కెట్లో ఏర్పడిన ఒడిదుడుకులకు తెగ బాధపడిపోతుంటారు. ట్రేడింగ్ అనిశ్చితలో ఉన్నప్పుడు రిటర్న్స్‌ని ఆశిస్తారు.

కాబట్టి వ్యాపారం లేదా పెట్టుబడి చేయాలి?

డబ్బు సంపాదించడానికి ట్రేడింగ్ అనేది ఒక మార్గం. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్‌లో ట్రేడింగ్ చెయ్యాలంటే కావాల్సింది మార్కెట్ నాలెడ్జి. మార్కెట్‌లో పెట్టుబడులు కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి. ట్రేడింగ్ అనే పదం వినడానికి వినసొంపుగా ఉన్నా.. అందులో కేవలం ఫైనాన్స్ నిపుణులు మాత్రమే రాణిస్తారు.