Tuesday, November 20, 2012

మాంద్యం(Recession) అంటే ఏమిటి..?

జిడిపి (GDP) పెరుగుదల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వరుస త్రైమాసికంలో నెగిటివ్‌లో ఉన్నప్పుడు మాంద్యం (Recession) అనే పదాన్ని ఉపయోగిస్తారు. స్థూల దేశీయ ఉత్పత్తి సంక్షిప్త పదం జిడిపి. దీని సహాయంతో ఉత్పత్తిని లెక్కిస్తారు. ఇండియా స్థూల దేశీయ ఉత్పత్తి 9% నుండి 6% శాతానికి తగ్గితే.. అదే అమెరికా లాంటి దేశాలలో స్థూల దేశీయ ఉత్పత్తి 1% నుండి -0.6% శాతానికి వరుసగా రెండు త్రైమాసికాలలో తగ్గగా, అప్పుడు ఈ రెండు దేశాలు మాంద్యం (Recession)లో ఉన్నట్లు పరిగణిస్తారు.

ఒక దేశం ఉత్పత్తిని స్థూల దేశీయ ఉత్పత్తి(GDP) ఉద్యోగం, పెట్టుబడి ఖర్చు, సామర్థ్య వాడకం, ఇంటి ఆదాయం, వ్యాపార లాభాలు, ద్రవ్యోల్బణం మొదలగున వాటితో లెక్కిస్తారు. మాంద్యం సమయంలో ఇలాంటివి అన్నీ దివాళా తీయడం వల్ల నిరుద్యోగ రేటు పెరుగుతుంది.

తెలుగు వన్ఇండియా