Tuesday, November 20, 2012

ఫైనాన్స్ బిల్లు అంటే ఏమిటి..?

ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్దిక మంత్రి ఫైనాన్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఉంటారు. ఇంతకీ ఈ ఈ ఫైనాన్స్ బిల్లు అంటే ఏమిటీ.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పాఠకుల కోసం ప్రత్యేకం.

భారతదేశ ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంవత్సరం కోసం ఈ సంవత్సరం తయారు చేసిన ఆర్థిక ప్రతిపాదనలకు అనుమతించే బిల్లు "ఫైనాన్స్ బిల్లు". ఈ బిల్లును రూపొందించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రతి సంవత్సరానికి గాను ఆ కాలానికి సంబంధించి అనుబంధ ఆర్ధిక ప్రతిపాదనలను ప్రభావం చూపుతుంది కాబట్టి.

ప్రతి సంవత్సరం ఆర్దిక మంత్రి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ పైనాన్స్ బిల్లును ప్రవేశపెడతారు. ఈ ఫైనాన్స్ బిల్లును ఎవ్వరూ వ్యతిరేకించ లేరు. వ్యయం బిల్లు, ఫైనాన్స్ బిల్లులు సభ్యులకు కాపీలు ముందుగా సర్క్యులేషన్ లేకుండా సభకు పరిచయం చేయవచ్చు. ఫైనాన్స్ బిల్లులో పన్ను ప్రతిపాదనలతో పాటు, గ్రాంట్స్ కోసం డిమాండ్లు ఓటు చెయ్యబడ్డ తర్వాత మాత్రమే లోక్ సభలో బిల్లు వస్తుంది.

ఫైనాన్స్ బిల్లుపై చర్చ విస్తారంగా ఉండడంతో భారతదేశ ప్రభుత్వం సభ్యులు ఏ చర్య ద్వారానైనా చర్చించవచ్చు. ఈ చర్చ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం రివ్యూకి వస్తుంది. ఫైనాన్స్ బిల్లులపై ఏవిధమైన చర్చ జరుగుతుందో సరిగ్గా అలాంటి చర్చే మనీ బిల్లులపై జరుగుతుంది.

తెలుగు వన్ఇండియా