Tuesday, November 20, 2012

పాన్ కార్డ్ అంటే ఏమిటీ, దీనిని ఎందుకు ఉపయోగిస్తాం...?

మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అనేది అవసరం. కారణం మీ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. మన పాన్ కార్డ్ అనేది పది డిజిట్లలో ఉంటుంది. ఆల్పా న్యూమరిక్ నెంబర్లను కలిగి ఉన్న ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందజేస్తుంది. దీనినే పాన్ కార్డ్ అంటారు.

ఇది మనం సాధారణంగా ఉపయోగించే బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మాదిరి ఉంటుంది. ఈ కార్డుపై మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. వ్యక్తిగత వివరాలు అంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, పాన్ నెంబర్‌తో పాటు మీ సంతకం మరియు మీ ఫోటో ఉంటుంది. పాన్ కార్డ్ పై గల పది ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉండే అక్షరాలలో మొదటి ఐదు అక్షరాలు ఆంగ్ల అక్షరాలు, తర్వాత నాలుగు అక్షరాలు సంఖ్యలు మరియు చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది. ఈ పది అక్షరాలను ఐదు భాగాలుగా విభజించడమైనది.

* మొదటి మూడు అక్షరాలుగా AAA to ZZZ ఉంటాయి.
* నాలుగవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ యొక్క స్థితిని తెలియచేస్తుంది.

• C - Company
• P - Person
• H - HUF(Hindu Undivided Family)
• F - Firm
• A - Association of Persons (AOP)
• T - AOP (Trust)
• B - Body of Individuals (BOI)
• L - Local Authority
• J - Artificial Juridical Person
• G - Government

* ఐదవ అక్షరం పాన్ కార్డ్ హోల్దర్ ఇంటి పేరు లోని మొదటి అక్షరంను తెలియచేస్తుంది.
* తర్వాత నాలుగు అక్షరాలు అంకెలలో 0001 నుండి 9999 వరకు ఉంటాయి.
* చివరి అక్షరం ఆంగ్ల అక్షరాన్ని కలిగి ఉంటుంది.

ఏయే సమయాల్లో పాన్ కార్డ్ అవసరం:

* డిమ్యాట్ అకౌంట్ ప్రారంభించడానికి
* యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే సమయంలో
* ఐటి డిపార్ట్ మెంట్ తో ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుటకు
* మ్యుచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సమయంలో
* యాభై వేల కంటే పైన డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొనుటకు ఉపయోగపడుతుంది.

(తెలుగు వన్ఇండియా)