Tuesday, November 20, 2012

టాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే ఏమిటీ...? వాటి వల్ల ఉపయోగం ఉందా..?

టాక్స్ ఫ్రీ బాండ్స్ అంటే 'పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టిన తర్వాత టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా తిరిగి వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి రాదన్నమాట'.

ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బు‍‌కు మీరు గవర్నమెంట్‌కు కట్టేటటువంటి మొత్తం ఇన్ కమ్ టాక్స్ పరిధిలోకి రాదు. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్‌ సెక్యూర్‌గా ఉండేలా పాక్షిక ప్రభుత్వ ఆధారిత సంస్థలు జారీ చేస్తాయి. లేకపోతే భారత ప్రభుత్వం గ్రీసీ మార్గంలో వెళ్లడం వల్ల సార్వభౌమ రుణం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ఎన్ఎస్ఈ, బిఎస్‌ఈ లలో ట్రేడ్ అవుతూ లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి.

అయినప్పటికీ.. ఈక్విడిటీల మాదికి ఎక్కువ మొత్తంలో ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ ట్రేడ అవ్వవు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, పాలన పన్ను ఫ్రీ బాండ్స్ సానుకూలంగా ఉంటాయి. 2012-2013వ సంవత్సరానికి గాను ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గతంలో మొత్తాన్ని సంస్థలు 2011-2012తో పోల్చితే రూ 60,000 కోట్ల కు పెంచుతుందని రెట్టింపుగా ప్రకటించాడు. ఇందులో NHAI కోసం రూ 10,000 కోట్లు, IRFC కోసం 10,000 కోట్లు, IIFCL కోసం 10,000 కోట్లు, HUDCO కోసం 5,000 కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంక్ కోసం 5,000 కోట్లు SIDBI కోసం 5,000 కోట్లు, పోర్ట్స్ కోసం 5,000 కోట్లు, పవర్ సెక్టార్ కోసం రూ 10,000 కోట్లు కేటాయించారు.

సెకండరీ మార్కెట్ ద్వారా ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టుబడులను పెట్టాలని చూస్తారో వారికి ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ బూమింగ్‌నిస్తాయి. పెట్టుబడి దారులు ఈ టాక్స్ ఫ్రీ బాండ్స్ లలో పెట్టుబడి పెట్టడం ద్వారా గతయేడాది కంపెనీలన బట్టి 8.20-8.35% వరకు టాక్స్ ఫ్రీ కూపన్ రేటుని సొంతం చేసుకున్నారు. ఉదాహారణకు ఫిబ్రవరి 2012లో HUDCO టాక్స్ ఫ్రీ బాండ్‌ని పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల వ్యవధిలో ఈ కంపెనీ 8.35% కూపన్ రేట్‌ని సొంతం చేసుకుంటుంది.

తెలుగు వన్ఇండియా