Wednesday, November 7, 2012

మళ్ళీ తెరమీదకు ఐటీ సంక్షోభం

దేశీయ ఆర్థిక వ్యవస్థను అంత ర్జాతీయ ఆర్థిక మాంద్యం నీడలా వెంటాడుతున్నది. ఇప్పటికీ అభివృద్ది చెందిన అమెరికా, యూరప్‌ దేశాలు మాంద్యంతో కొట్టుమిట్టాడడంతో భారత్‌ వంటి వర్ధమాన దేశాలు కూడా ఈ దెబ్బకు విలవిల్లాడుతున్నది. ఇప్పటికే దేశీయ వృద్ధిరేటు 5 శాతం దాటే పరిస్థితి కానరావడం లేదు.తాజాగా దేశీయ ఆర్థిక వ్యవ స్థకు వెన్నుముఖ లాంటి ఐటీ రంగం తీవ్ర సవాళ్లను ఎదుర్కొం టున్నది. అమెరికా, యూరప్‌ దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధా నాలతో భారత్‌ ఐటీ మార్కెట్లో ఉపాధి అవకాశాలకు శాపం గా మారాయి. ఇప్పటికే బారక్‌ ఒబా మా భారత్‌ వ్యతిరేక వెైఖరి అవ లంభించడంతో దేశీయ ఐటీ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితు లను ఎదుర్కొంటున్నది. మరో వెైపు యూరప్‌లో కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఆదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో దే శీయ ఐటీ వర్క్‌ ప్రాజెక్టులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, విప్రో, టిసిఎస్‌ వంటి కంపెనీలు నియమాకాల జోరుకు బ్రేకులు వేశాయి.



డిసెంబర్‌ పైనే ఆశలు : ఫలితంగా ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు దాదాపుగా నిలియిపోయాయి. ప్రతి ఏటా రెండున్నర లక్షల మంది యువతకు ఐటీ అవకాశాలు లభిస్తే, ఈసారి ఆ అవకాశాలు కనుచూపు మేరలో కాన రావడం లేదు. ప్రతి ఏటా జులెైలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ నియామకాల పండుగ జోరుగా జరుగుతుండగా, ఈఏడాది నవంబర్‌ ప్రవేశించిన అటువంటి వాతావరణం కానరావడం లేదు. తాజాగా ఇన్ఫోసిస్‌ వచ్చే మూడు నెలల వరకు ఎటువంటి క్యాంపస్‌ నియామకాలు ఉండవని, కంపెనీ చవి చూస్తున్న నష్టాల భారాన్ని వీలెైనంత మేరకు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బెంగుళూరులో ప్రకటించింది. అదే విధంగా ఉద్యోగుల శిక్షణపై వెచ్చించే ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించుకొంటున్నట్లు ఇన్ఫోసిస్‌ ఇప్పటికే ప్రకటించింది. గత ఏడాది ఈ సీజన్లో కాగ్నిజంట్‌, విప్రో, టిఎసిఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలు చేపట్టిన క్యాంపస్‌ నియామకాలతో పోల్చితే, ప్రస్తుతం ఇది నాల్గొవంతుకు పడిపోయిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.



2009 నుంచి దేశీయ ఐటీ రంగం ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటున్నప్పటికీ, 2011-12 ఆర్థిక సంవత్సరం దేశీయ ఐటీ కంపెనీలు మెరుగెైన ఫలితాలు సాధించడంతోపాటు, అన్ని స్థాయిల్లోనూ నియామకాలను మెరుగెైనట్లు జాబ్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా 2012-13 ఆర్థిక సంవత్సరం అంతర్జాతీయ మాంద్యంతో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. ఆపెై అమెరికా ఆర్థిక వ్యవస్థను శాండీ వంటి పెను తుఫాన్లు దెబ్బతీయండతో ఆప్రభావం భారత్‌ వంటి దేశా లపెై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఫలితంగా దేశీయ ఐటీ కంపెనీలు చేతిలో ఉన్న అరకొర ప్రాజెక్టులు చేజారడంతో, పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు మూత పడుతున్నాయి. దీంతో ప్రతి నెలా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఒక హైదరాబాద్‌ మార్కెట్లోనే రోడ్డునపడడం గమనార్హం.



ఆందోళనలో ఇంజనీరింగ్‌ యాజమాన్యాలు: తాజాగా హైదరాబాద్‌ ఐటీ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా స్థానిక ఐటీ కంపెనీలతోపాటు, ఉద్యోగులు కూడా చెన్నయ్‌, బెంగుళూరు, నొయిడా, ముంబాయి, పూనే వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరులుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా పొదుపు చర్యల్లో భాగంగా ఐటీ దిగ్గజాలు చేపడుతున్న కఠిన చర్యలతో ఇంజనీరింగ్‌ కాలేజీలతోపాటు విద్యార్థులు కలవరం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 750 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉంటే, ఇప్పటికే వాటి పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. తాజా ఐటీ పరిశ్రమ ప్రతికూల పరిస్థితుల రీత్యా మరింత బెంబేలె త్తుతున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా ఐదు లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు బయటకు వస్తే, దీనిలో ఒక ఆంధ్రప్రదేశ్‌ నుంచే రెండు లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారని గణాంకాలు వెల్లడి స్తున్నాయి.



ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఐటీ నియామకాలు జరుగుతుంటే, దీనిలో ఒక ఏపీలోనే లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, తాజా గడ్డు పరిస్థితులు స్థానిక విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలకు మింగుడుపడడం లేదు.ఫలితంగా పీజీ ఇతర ఉన్నత చదువులపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నట్లు జామ్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజా ఐటీ పరిశ్రమల సవాళ్లపెై ఇటు రాష్ట్ర ఐటీ శాఖ గాని, అటు ఐటీ అసోసియేషన్లు గానీ స్పంధించడానికి విముఖత కనబరుస్తున్నాయి.