Tuesday, November 20, 2012

'కమోడిటీస్ ఇన్వెస్ట్‌మెంట్' లో ప్రాథమిక అంశాలు:

"కమోడిటీస్ పెట్టుబడి" ఈ పదం చాలా ప్రాచుర్యం పొందినప్పటికీ.. దీని గురించి తెలియదు. మన దైనందిన జీవితంలో చాలా మంది నోట ఈ మాట వింటూ ఉంటాం. అయినప్పటికీ, పెట్టుబడికి వచ్చే సరికే చాలా మందికి ఈ పదం ఎక్కడ వాడతారో, ఎప్పుడు వాడతారో తెలుసుకుందాం. కమోడిటీస్‌లో పెట్టుబడి పెట్టడం అనేది కొత్త కాకపోయినా.. గత సంవత్సరాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ఈక్విటీస్‌లో పెట్టుబడులు ఎలాగైతే పెడతామో, కమోడిటీస్‌లో అదే విధంగా పెట్టుబడులు పెడతాం.

ఈ రెండింటి మధ్య ఉన్న బేధం ఒక్కటే. ఈక్విటీ మార్కెట్ ట్రేడ్స్ ఈక్విటీస్‌(కంపెనీల షేర్లు)లో జరుగుతుండగా, కమోడిటీస్ మార్కెట్ ట్రేడింగ్ కమోడిటీస్ అయిన బంగారం, సిల్వర్, సోయా, గోధుమ మొదలగున వాటిల్లో జరుగుతుంది.

కమోడిటీస్ రకాలు: కమోడిటీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక విలువను సూచించే ముడి పదార్థాలు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు కమోడిటీస్‌లో ఎన్ని రకాలు ట్రేడ్ అవుతున్నాయో తెలుసుకోవాలి. వ్యాపారం చేసేందుకు అనేక వస్తువుల ఉన్నాయి, ముఖ్యమైన వాటిని మీకు ఈ క్రింద సూచించబడుతున్నాయి. ఐదు భాగాలుగా వీటిని విభంజించారు.

ఎనర్జీస్: కమోడిటీ మార్కెట్లో కమోడిటీస్ క్రింద్ ట్రేడ్ అయ్యే వాటిల్లో ఎనర్జీ ఒకటి. ఎనర్జీస్ క్రిందికి క్రూడ్ ఆయిల్, హీటింగ్ ఆయిల్, సహాజ వాయువు, గ్యాసోలైన్ మొదలగునవి వస్తాయి.

ఖనిజాలు: ఖనిజాలు రెండు రకాలు. ఒకటి ఆధార ఖనిజాలు కాగా రెండవది విలువైన ఖనిజాలు. ఆధార ఖనిజాలలో అల్యూమినియం, కాపర్, జింక్, లీడ్, నిఖెల్, టిన్‌లను కలిగి ఉన్నాయి. అదే విలువైన ఖనిజాలలో బంగారం, సిల్వర్, ప్లాటినమ్, ప్లలాడియమ్‌ను కలిగి ఉంది.

ధాన్యాలు: ధాన్యాలలో గోధుమ, వరి, వోట్స్, మొక్కజొన్న మరియు సోయాబీన్స్ కలిగి ఉంటాయి.

సాఫ్ట్ ఉత్పత్తులు: సాధారణంగా సాఫ్ట్ ఉత్పత్తులలో పత్తి, చక్కెర, నారింజ రసం, కోకో మరియు కాఫీ లాంటి వాంటి ట్రేడింగ్ చేస్తారు.

లైవ్ స్టాక్: లైవ్ స్టాక్ అనేది వేరో టైపు కమోడిటీ. పంది మాంసం, జీవం కలిగి ఉన్న జంతువులు ఈ లైవ్ స్టాక్ క్రింద ట్రేడింగ్ అవుతాయి.


(తెలుగు వన్ఇండియా)