Friday, February 26, 2010

రూ.11.08 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్

రూ.11.08 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
మౌలిక సదుపాయాలకు రూ.1.73 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : ఉత్కంఠ వీడింది. బడ్జెట్ బండి వచ్చేసింది. యుపిఎ ప్రాధాన్యం వెల్లడయింది. వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికే ఈ ఏడాది నిధుల ప్రణాళికలో ప్రాధాన్యమని స్పష్టమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2010-11 సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.11.08 లక్షల కోట్లతో ఘనమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రణబ్... ఈసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మౌలిక సదుపాయా ల కల్పనకు రూ.1.73 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో రూ.1.47 లక్షల కోట్లను ప్రకటించారు. అలాగే గ్రామీణాభివృద్ధికి రూ.66వేల కోట్లను, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.44వేల కోట్లను ప్రణాళిక పద్దులో చూపా రు. అలాగే భారత్ నిర్మాణ్ పేరిట ఓ కొత్త పథకం ప్రవేశపెట్ి రూ.48వేల కోట్లను కేటాయించడం విశేషం. వ్యవసాయ, పరిశ్రమల రంగాలపై సమంగా వరాల జల్లు కురిపించారు. పెట్రో ఉత్పత్తులపై సుంకం విధించి పరోక్ష ఆదాయమార్గాలపై ప్రణబ్ ముఖర్జీ దృష్టి సారించారు.

ప్రణబ్ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు :

* 2010-11 సంవత్సరానికి బడ్జెట్ రూ.11,08,749 లక్షల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 7,35,657 లక్షల కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ.3,73,092 లక్షల కోట్లు
* 2008-09లో ద్రవ్యలోటు 6.96 శాతం
* 2010-11లో ద్రవ్యలోటు అంచనా 5.5 శాతం
* పన్నుల ద్వారా ఆదాయం రూ.7,46,650 కోట్లు
* పన్నేతర ఆదాయం రూ.1,48,118 కోట్లు
* రక్షణ రంగానికి రూ.1.47 లక్షల కోట్లు
* గ్రామీణ మౌలికసదుపాయాలే యుపిఎ లక్ష్యం
* మౌలిక సదుపాయాలకు రూ.1.73 లక్షల కోట్ల నిధులు కేటాయింపు
* ప్రణాళిక నిధుల్లో 46 శాతం మౌలిక సదుపాయాలకే
* 2014 నాటికి పది శాతం వృద్ధిరేటు లక్ష్యం
* ఈ ఏడాది వృద్ధిరేటు లక్ష్యం తొమ్మిది శాతం
* గ్రామీణాభివృద్ధికి 75 శాతం అదనంగా నిధులు
* గ్రామీణాభివృద్ధికి రూ.66,100 కోట్లు
* గ్రామీణ ఉపాథి హామీ పథకానికి రూ.40,100 కోట్లు
* ఇందిరా ఆవాస్ యోజన పథకానికి రూ.10 వేల కోట్లు
* ఆరోగ్య రంగానికి రూ.22,300 కోట్లు
* రైల్వేలకు రూ.16,752 కోట్లు
* విద్యుత్ రంగానికి నిధులు రెట్టింపు
* విద్యుత్ రంగానికి రూ.5,130 కోట్లు
* ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ.25 వేల కోట్ల సమీకరణ
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సాయం రూ.16,500 కోట్లు
* మహాత్మాగాంధీ నవభారత్ నిర్మాణ్ పేరిట కొత్త పథకం
* నవభారత్ నిర్మాణ్‌కు రూ.48 వేల కోట్లు
* రోడ్ల అభివృద్ధికి నిధులు 13 శాతం పెంపు
* రహదార్ల నిర్మాణానికి రూ.19, 894 కోట్లు
* బుందేల్‌ఖండ్‌కు రూ.12,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజ్
* 2020 నాటికి 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యం
* కొత్తగా హైడ్రో, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
* సోలార్ విద్యుత్ కోసం రూ.1,000 కోట్ల కేటాయింపు
* హైడ్రో విద్యుత్‌కు రూ.500 కోట్లు
* దేశంలోని 98 శాతం ప్రాంతాల్లో ప్రాథమిక్య విద్య అందుబాటులోకి వచ్చింది
* ప్రాథమిక విద్య రంగానికి రూ.31,036కోట్లు
* కొండ ప్రాంతాల అభివృద్ధికి రూ.1000 కోట్లు
* అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.1,000 కోట్లతో నేషనల్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు
* పట్టణ ఉపాథి హామీకి రూ.5,400 కోట్లు
* బిసి సంక్షేమానికి రూ.7,300 కోట్లు
* గ్రామీణ ప్రాంతాలలో రుణాలకు రూ.3.75 లక్షల కోట్ల రుణ సౌకర్యం
* రైతులకు రుణాల చెల్లింపున జూన్ 30 దాకా గడువు పొడిగింపు
* రుణాలు గడువులోపు చెల్లించిన రైతులకు 5 శాతానికే రుణాలు
* ఎరువుల సబ్సిడీ నేరుగా రైతులకే
* వ్యవసాయ రంగ అభివృద్ధినిక నాలుగంచెల వ్యూహం
* మహిళా రైతులకు రూ.100 కోట్లతో ప్రత్యేక పథకం
* నీటి సంరక్షణకు రూ.200 కోట్లు కేటాయింపు
* ఎరువుల సబ్సిడీ తగ్గించక తప్పడం లేదని వెల్లడి
* ఎఫ్‌సిఐ గోడౌన్ల లీజు పరిమితి ఏడేళ్ళకు పెంపు
* సెజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన
* ఏప్రిల్ నుంచి పోషక విలువలతో కూడిన ఎరువుల సరఫరా
* తూర్పు భారతదేశంలో హరిత విప్లవం కోసం రూ.2 వేల కోట్ల కేటాయింపు
* ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి రూ.400 కోట్లు
* రాజీవ్ ఆవాస్ యోజన పథకానికి రూ.1,270 కోట్లు
* రూ.48 వేల కోట్లతో మహాత్మాగాంధీ గ్రామీణ క్లీన్ అండ్ గ్రీన్ పథకం
* గంగానది ప్రక్షాళనకు రూ.500 కోట్లు
* గంగానదిలో వ్యర్థాలు కలవకుండా గట్టి చర్యలు
* తమిళనాడులో చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు రూ.200 కోట్లు
* గోవాలో బీచ్‌ల అభివృద్ధికి రూ.200 కోట్లు
* నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ ఏర్పాటు
* వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎరువుల ధరలు యథాతథం
* కొత్త ఏడాది నుంచి జిఎస్‌టి అమలు
* అప్పుల నిష్పత్తిపై ఆరు నెలల్లో నివేదిక
* ఆర్థిక కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన
* 2011, ఏప్రిల్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ సిస్టమ్
* ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ విదేశీ పెట్టుబడుల్లో వృద్ధి
* ఆహారభద్రత కోసం ప్రత్యేక చర్యలు
* త్వరలో పార్లమెంటు ముందుకు ఆహారభద్రత బిల్లు
* త్వరలో పార్లమెంటు ముందుకు 2009 కంపెనీల బిల్లు
* స్వయం సహాయక బృందాల నిధి రూ.400 కోట్లకు పెంపు
* సంప్రదాయేతర ఇంధన వనరులకు 61 శాతం నిధుల పెంపు
* మరిన్ని ప్రయివేటు బ్యాంకులకు ఆర్‌బిఐ అనుమతి
* ధరల పెరుగుదల ఆందోళన కలిగించే అంశం
* ద్రవ్యలోటు పెరుగడంపై ఆందోళన
* ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రయత్నాలు
* ఫారిక్ కమిటి సిఫార్సుల ఆధారంగా పెట్రో ధరలపై నిర్ణయం
* రెండువేల జనాభా గల ప్రతీగ్రామానికి బ్యాంకింగ్ సేవలు
* పట్టణాలలో మురికివాడల అభివృద్ధికి రూ.1,000 కోట్లు
* యు.ఐ.డి. ప్రాజెక్టుకు రూ.1,900 కోట్లు
* మావోయిస్టు ప్రాంతాల అభివృద్ధికి అదనపు నిధులు
* ఎగుమతులపై పన్ను రాయితీ కొనసాగింపు
* బొగ్గు నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు
* ద్రవ్య స్థిరత్వం, అభివృద్ధికి ప్రత్యేక కౌన్సిల్
* పరిశ్రమలకు ఉద్దీపనల ఉపసంహరణపై సమీక్ష
* పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపం వద్ద కొత్త పోర్టు
* రూ.20 లక్షల లోపు గృహరుణాలకు ఒక శాతం వడ్డీ రాయితీ
* కల్లుగీత, చేనేత కార్మికులకోసం ప్రత్యేక నిధి
* ప్రతి కొత్త పెన్షన్ అకౌంట్‌కు రూ.1,000 జమ
* వ్యాపారులకు రూ.60 లక్షల వరకూ ఆడిట్ మినహాయింపు
* వృత్తి నిపుణులకు రూ.15లక్షల వరకూ ఆడిట్ మినహాయింపు
* న్యాయసేవలు అందించేందుకు ప్రత్యేక సంస్థ
* వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరికరాల దిగుమతికి రాయితీలు