Friday, February 26, 2010

ఇండస్ట్రీయల్‌ అవుట్‌పుట్‌

ఇండస్ట్రీయల్‌ అవుట్‌పుట్‌

factoryన్యూఢిల్లీ : సానుకూలమైన ఇండస్ట్రియల్‌ అవుట్‌పుట్‌ 20 09-10 ఆర్థిక సంవత్సరం లో కనిపించిందని ఆర్థిక సర్వే తెలిపింది. మ్యాను ఫ్యాక్షరింగ్‌ రంగం మునుపెన్నడూ లేని విధంగా సానుకూలమైన వృద్ధి దిశలో సాగుతోందని ముందస్తు బడ్జె ట్‌ ఆర్థిక సర్వే తెలిపింది. దేశీయ పరిశ్రమలు మాంద్యం పరిస్థితు లను అధిగమిస్తున్నా ఆహార ఉత్ప త్తులు, కాటన్‌ టెక్స్‌టైల్స్‌, మెటల్‌ వంటి రంగాలు వృద్ధిలోకి రావాల్సి ఉందని పేర్కొంది. 2009- 10ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణా లు ఈ రంగానికి 4లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అనుకున్న స్థాయిలో బ్యాంకుల రుణ రే ట్లు లేవని ఈ సర్వే తెలిపింది. దీంతో కార్పొరేట్లు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడంతో ఎన్‌బీఎఫ్‌సీల నిధులు 50వేల కోట్ల రూపాయలు చేరుకున్నాయని తెలిపింది.