Friday, February 26, 2010

9 శాతం పెరగనున్న స్టీల్‌ వినియోగం

9 శాతం పెరగనున్న స్టీల్‌ వినియోగం

colombia_steelన్యూఢిల్లీ : దేశీయంగా స్టీలు వినియో గం 6 నుంచి 9శాతం వరకూ పెరగవ చ్చని ఆర్థికసర్వే వెల్లడించింది. స్థిరాిస్థి, నిర్మాణ, వాహన రంగాలు మళ్లీ వృద్ధి లోకి రావడంతో స్టీలు వినియోగం ఈ ఏడాది పెరగవచ్చని తెలిపింది. గత సం వత్సరం ఏప్రల్‌ నుండి ఈ ఏడాది జనవరి మాసాల మధ్య 7.9 శాతంతో స్టీలు వినియోగం 45.93మిలియన్‌ టన్నులుగా నమో దైందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో బలమైన వృద్ధితో పాటు దేశ పారిశ్రామిక సూచీ కూడా స్టీలు రంగ వినియోగం మళ్లీ వృద్ధి దిశగా ఉందని చెబుతు న్నాయి. ప్రయి వేటు రంగ సంస్థల ఉత్పత్తి సామర్థాలతో పాటు అధిక వినియోగ ధరల కారణంగా స్టీలు రంగం స్థిరపడుతోందని తెలిపింది. 2011-12నాటికి ప్రభుత్వం 120మిలియన్‌ టన్నుల మేరకు స్టీలు ఉత్పత్తిని పెంచనుంది.