కొత్త విండోస్‌తో సెల్ సొగసులు! విండోస్ ఫోన్ 7 సిరీస్ సులువైన ఇంటర్ఫేస్.. ఆధునిక సౌకర్యాలు.. సోషల్ నెట్‌వర్కింగ్.. వీడియో గేమ్స్.. రియల్ టైం అప్‌డేట్స్.. చిటికెలో పోస్టింగ్స్.. మొబైల్ విప్లవంలో ఇదో కొత్త ఆపరేటింగ్ సిస్టం!

'హోం స్క్రీన్' ప్రత్యేకం
ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న ఏ మొబైల్ హోం స్క్రీన్‌ను చూసినా ఐకాన్స్‌లో మార్పులు తప్పితే, సౌకర్యాలు మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటాయి. విండోస్ ఫోన్ 7 ఈ సంప్రదాయాన్ని చెరిపేయనుంది. తనదైన శైలిలో హోం స్క్రీపై 'లైవ్ టైటిల్స్'ను అందిస్తోంది. ఈ-మెయిల్స్, ఎంఎస్‌లు, మిస్‌కాల్స్, ఫొటోలు, సోషల్ నెట్‌వర్క్ లైవ్ అప్‌డేట్స్‌ని సులువుగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీ స్నేహితుడు తన ఫొటో ఆల్బమ్‌లో కొత్తగా ఏదైనా ఫొటోని అప్‌లోడ్ చేసినా, మెయిల్ పంపినా హోం స్క్రీన్‌పై థంబ్‌నెయిల్‌లో ఫొటో, అవుట్‌లుక్‌లో ఈమెయిల్ కనిపిస్తాయి. హోం స్క్రీన్‌లోనే Xbox LIVE గేమ్ జోన్‌ని యాక్సెస్ చేయవచ్చు. తెరకు పైభాగంలో ఫేస్‌బుక్, విండోస్ లైవ్... లాంటి సోషల్ నెట్‌వర్క్ రియల్ టైం అప్‌డేట్స్‌ని పొందొచ్చు. People మెనూనే అందుకు ఉదాహరణ. ఫేస్‌బుక్, విండోస్‌లైవ్‌లో ఏదైనా మేసేజ్ పోస్ట్ చేయాలనుకుంటే Share a quick Message ద్వారా చిటికెలో పోస్ట్ చేయవచ్చు. స్నేహితులందరికీ మీ అప్‌డేట్స్ చేరిపోతాయి. ఒకవేళ ఫ్రెండ్స్ అప్‌డేట్స్‌ని చూడాలనుకుంటే What's Newను స్క్రోల్ చేస్తే సరిపోతుంది. స్నేహితుల ఫ్రొఫైల్ సెర్చ్ చేసి, Call Mobile, Text Mobile, Call Home ద్వారా సులభంగా కాంటాక్ట్ చేయవచ్చు. Recentలో అప్పడే అప్‌డేట్ చేసిన ఫొటోలను చూడొచ్చు.
పంచుకోవడం సులభం
ఫొటోలను షేర్ చేసుకోవడానికి మరింత సులభమైన ఇంటర్ఫేస్‌ను డిజైన్ చేశారు. అదే పిక్చర్ మెనూ. దీంట్లో Gallery, Albums, all, Favoritesను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫొటోలను పూర్తిస్థాయిలో మేనేజ్ చేసుకోవచ్చు. Allను ఎంచుకుని థంబ్‌నెయిల్స్‌లో ఫొటోను చూడొచ్చు. ఫోన్, పీసీ, వెబ్‌ఆల్బమ్స్‌లో నిక్షిప్తం చేసిన ఫొటోలను యాక్సెస్ చేయవచ్చు. ఇతరులతో పంచుకోవాలనుకుంటే Upload to facebook, Share to... ద్వారా వివిధ సోషల్ నెట్‌వర్క్‌ల్లో అప్‌లోడ్ చేయవచ్చు. ఫోన్, రెేడియో, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని మ్యూజిక్, వీడియో సర్వీసులను Music+video యాక్సెస్ చేయవచ్చు. అందుకోసం Zune Music player సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. మ్యూజిక్‌ని ఎంచుకోగానే వచ్చే Music, Video, Podcast, radio, Marketplaceల ద్వారా కావాల్సిన వాటిని బ్రౌజ్ చేసుకుని మ్యూజిక్, వీడియో ఆల్బమ్‌లను రూపొందించుకోవచ్చు. అందుకోసం అప్‌స్టోర్ మాదిరిగా ZUNE మ్యూజిక్ సర్వీసుని అందిస్తున్నారు. విండోస్ ఫోన్ యూజర్లు పాటలు, వీడియోలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.www.zune.net
ఆటలే ఆటలు!
వీడియో గేమ్ ప్రియులు Xbox LIVEకు ఫోన్ నుంచి అనుసంధానం అవ్వొచ్చు. ఆన్‌లైన్‌లోనే మీ స్నేహితులతో గేమ్స్ ఆడుకోవచ్చు. లైవ్‌గేమ్స్, స్పాట్‌లైట్ ఫీడ్, అవతారాలు, ఫ్రొఫైల్స్‌ను చూడొచ్చు. మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెచ్చిన బింగ్ సెర్చ్ ఇంజన్‌ను ఫోన్‌లో సులువుగా వాడుకోవచ్చు. సిస్టంలో మాదిరిగానే సెర్చ్‌బాక్స్‌లో టైప్ చేసి బ్రౌజ్ చేయవచ్చు. వెతికే క్రమంలో కీవర్డ్స్‌ని కూడా చూపిస్తుంది. Maps, Directionsని కూడా చూడొచ్చు. ఆఫీస్ డాక్యుమెంట్స్ రూపకల్పన మరో ప్రత్యేకత. మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఆఫీస్ టూల్స్‌తో వర్డ్ డాక్యుమెంట్స్, ప్రజంటేషన్స్‌లను ఫోన్‌లోనే రూపొందించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ మొబైల్ అప్లికేషన్స్ (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, వన్‌నోట్), ఆఫీస్ షేర్‌పాయింట్, షెడ్యూల్స్, To-Do Listను యాక్సెస్ చేయవచ్చు.
మరికొన్ని...
* మైక్రోసాఫ్ట్ అందిస్తున్న My phone సర్వీసు ద్వారా ఫోన్‌లో సేవ్ చేసి ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, క్యాలెండర్ ఎంట్రీలు, కాంటాక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో మేనేజ్ చేయవచ్చు. మై ఫోన్ సర్వీసులో అందిస్తున్న ప్రీమియం ప్యాకజీ ద్వారా ఫోన్‌ను పొగట్టుకున్న సమయంలో జీపీఎస్ నెట్‌వర్క్ ఆధారంగా ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకోవచ్చు.
* మొబైల్ తెరకు కింది భాగంలో ఏర్పాటు చేసిన నేవిగేషన్ కంట్రోల్స్ ఆధారంగా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను మరింత సౌకర్యంగా వాడుకోవచ్చు.
* మరిన్ని వివరాలు, వీడియో డెమోలకు www.windowsphone7series.com