Thursday, February 25, 2010

మూడో వంతు జీతాలకే

మూడో వంతు జీతాలకే

న్యూఢిల్లీ: రైల్వే శాఖ తన ఆదాయంలో మూడోవంతు జీతభత్యాల మీదే వెచ్చిస్తోంది. ప్రతి రూపాయిలో 34 పైసలు జీతభత్యాలకు, 13 పైసలు పెన్షన్ ఫండ్‌కు వెచ్చిస్తున్నట్లు మమతాబెనర్జీ తెలిపారు. అలాగే ఇంధనానికి 17 పైసలు వెళ్తున్నాయి. ఆదాయంలో 66 శాతం సరుకు రవాణా ద్వారాను, 27 శాతం ప్రయాణికుల టికెట్ల ద్వారాను వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ. 58,715.66 కోట్ల ఆదాయం రాగా, 2010-11 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 62,489.33 అవుతుందని మమత అంచనా వేశారు. ఇందులోనూ సింహభాగం బొగ్గుదే. ఆ తర్వాతి స్థానాల్లో సిమెంటు, ఆహారదినుసులు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర కంటెయినర్ సర్వీసులు ఉన్నాయి. చార్జీలేమీ పెంచకపోయినా, ట్రాఫిక్ పెరుగుదల వల్ల రూ. 2069 కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు..