Thursday, February 25, 2010

రాష్ట్రంపై 'మమత' రైళ్లు.. లైన్లు.. పొడిగింపుల లెక్క ఇదీ!

రాష్ట్రంపై 'మమత'
రైళ్లు.. లైన్లు.. పొడిగింపుల లెక్క ఇదీ!

(ఆన్‌లైన్, హైదరాబాద్) రైల్వే మంత్రి ఈసారి ఆంధ్రప్రదేశ్‌పై మమత చూపారు. ఎన్నడూ లేనివిధంగా కరుణాకటాక్షాలు ప్రదర్శించారు. 9 కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిపాదించారు. ఇందులో ఒక ముంబై నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు ఎక్కడా ఆగకుండా వచ్చే డ్యురంటో రైలు ఉండటం గమనార్హం. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కొత్తగా ప్రవేశపెట్టనున్న భారత్ తీర్థ ఎక్స్‌ప్రెస్‌ల్లో ఏడు రైళ్లు రాష్ట్రం గుండా వెళ్లనున్నాయి. ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూరాలను పొడిగించగా, విశాఖపట్నం - నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ ఇకపై వారానికి 3 రోజులు బదులు ఐదు రోజులు నడవనుంది. తిరుపతి - మదనపల్లి రోడ్ మధ్య కురబకోట ప్యాసింజర్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. వీటికి అదనంగా రెండు 'మెము', రెండు 'డెము' రైళ్లను కూడా ప్రవేశపెడుతున్నారు.

కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య మాతృభూమి రైలును ప్రారంభించనున్నారు. భద్రాచలం - సత్తుపల్లి రైలు లైనును బడ్జెట్‌లో చేరుస్తున్నట్టు ప్రకటించారు. సికింద్రాబాద్‌లో వేగన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతో పాటు స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కోటిపల్లి - నర్సాపురంల మధ్య కొత్త మార్గంతో పాటు అనేక ప్రాజెక్టుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినట్టు తెలిపారు. వోడరేవు - నిజాంపట్నం పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యతనివ్వనున్నట్టు చెప్పారు.

కొత్త రైళ్లు
ఎక్స్‌ప్రెస్ రైళ్లు:
1. హైదరాబాద్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్(వారానికి రెండుసార్లు)
2. బెంగళూరు-తిరుపతి ఇంటర్‌సిటీ (వారానికి మూడుసార్లు)
3. మదురై-తిరుపతి ఎక్స్‌ప్రెస్(వారానికి రెండుసార్లు)
4. తిరుపతి-పాకాల-మదనపల్లి రోడ్-సికింద్రాబాద్(వారానికి రెండుసార్లు)
5. హైదరాబాద్-తిరుపతి(రోజూ),
6. హైదరాబాద్-ఛత్రపతి సాహు మహారాజ్ టెర్మినస్(వారానికి 2సార్లు),
7. తిరుపతి-ఛత్రపతి సాహు మహారాజ్ టెర్మినస్(రోజూ)
8. సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్ (వారానికి మూడుసార్లు)

ఏసీ దురంతో రైలు:
ముంబై-సికింద్రాబాద్(ఏసీ- నాన్‌స్టాప్) (వారానికి రెండు సార్లు)

ప్యాసింజర్ రైలు:
1. తిరుపతి-మదనపల్లె రోడ్-కురలబకోట(గేజ్ మార్పిడి తర్వాత)
మాతృభూమి (మహిళలకు ప్రత్యేక రైలు)
1. ఫలక్‌నుమా-లింగంపల్లి
సర్క్యులర్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ రైళ్లు (మెము):
1. తిరుపతి-నెల్లూరు-చెన్నై, 2. విజయవాడ-గుంటూరు-తెనాలి
డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ రైళ్లు (డెము):
1. కాచిగూడ - మహబూబ్‌నగర్, 2. కాచిగూడ - మిర్యాలగూడ

సర్వీసుల పెంపు:
విశాఖపట్నం - నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్ (వారానికి 5 రోజులకు)
హౌరా - యశ్వంతపూర్ డ్యురంటో ఎక్స్‌ప్రెస్(వారానికి 4 రోజులకు )
కోబ్రా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ (వారానికి 2 రోజులకు)
పాట్నా - బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ (వారానికి 7 రోజులకు)

తీర్థ యాత్రలకు చలో
దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ మీదుగా కలుపుతూ 7 కొత్త రైళ్లు ('భారత్ తీర్థ్' ) మంజూరయ్యాయి.
అవి... హౌరా - విశాఖపట్నం - హైదరాబాద్ - అరకు - హౌరా
ముంబై - పుణె - తిరుపతి - కాంచీపురం - రామేశ్వరం - మదురై - కన్యాకుమారి
పుణె - రత్నగిరి - గోవా - బెంగళూరు - మైసూరు - తిరుపతి - పుణె
మదురై - ఈరోడ్ - పుణె - ఉజ్జయిని - నాసిక్ - హైదరాబాద్ - చెన్నై - మదురై
మదురై - మైసూరు - గోవా - ముంబై - ఔరంగాబాద్ - హైదరాబాద్
మదురై - చెన్నై - కోపర్‌గావ్ - మంత్రాలయం - చెన్నై - మదురై
భోపాల్-తిరుపతి-కాంచీపురం-రామేశ్వరం-మదురై-కన్యాకుమారి-కొచ్చిన్-భోపాల్

సర్వీసుల పొడిగింపు:
1.సికింద్రాబాద్ - మన్మాడ్ ఎక్స్‌ప్రెస్‌ను షిర్డీ వరకు (వారానికి రెండు సార్లు)
2.కాకినాడ - మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ షిర్డీ వరకు( వారానికి ఒకసారి)
3.కాకినాడ - మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ షిర్డీ వరకు (వారానికి రెండు సార్లు)
4. విజయవాడ - మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ షిర్డీ (వారానికి ఒకసారి)
5. కాచిగూడ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ అకోలా వరకు (రోజు),
6. పర్లి - నిజామాబాద్ పాసింజర్ పండార్పూర్ వరకు

ఒకే ఒక కొత్తలైను:
భద్రాచలం రోడ్ - సత్తుపల్లి మధ్య చిన్న మార్గంలో కొత్త లైనును ఈ బడ్జెట్‌లో చేపడతామని మమతా బెనర్జీ ప్రకటించారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ప్రతిపాదించిన లైన్లు :
1. గడ్చందూర్ - ఆదిలాబాద్, 2. నడికుడి - శ్రీకాళహస్తి, 3. భద్రాచలం రోడ్ - కొవ్వూరు, 4. మణుగూరు - రామగుండం, 5. అక్కన్నపేట - మెదక్ - మేడ్చల్, 6. కొండపల్లి - కొత్తగూడెం, 7. కంభం - ప్రొద్దుటూరు, 8. గద్వాల - మాచర్ల

లైన్లు.. స్టేషన్లు
కొత్తగా ప్రతిపాదించిన లైన్లు :
1. గిద్దలూరు - భాకరాపేట, 2. బాపట్ల - నిజాంపట్నం - రేపల్లె, 3. మేళ్లచెరువు - జాన్‌పహాడ్, 4. పగిడిపల్లి - శంకరపల్లి, 5. గడ్చందూర్ - ఆదిలాబాద్, 6. విజయనగరం - పలాస వయా రాజాం, 7. నంగ్లి - చిత్తూరు, 8.మరికుప్పం - కుప్పం, 9. బోధన్ - బీదర్

డబ్లింగ్ నిమిత్తం సర్వేల కోసం ప్రతిపాదించిన లైన్లు :
1. గుంటూరు-గుంతకల్
ఈ ఆర్ధిక సంవత్సరంలో పూర్తి చేసేందుకు నిర్ణయించిన లైన్లు:
1. నంద్యాల - ఎర్రగుంట్ల మార్గంలోని నొస్సం- బనగానపల్లి
2. పెద్దపల్లి - నిజామాబాద్ మార్గంలోని జగిత్యాల - మోర్తాడ్
3. గద్వాల-రాయచూర్ మార్గంలోని గద్వాల్-పాండురంగస్వామి
4. విష్ణుపురం-జాన్‌పహాడ్

గేజ్ మార్పిడి: 1. ధర్మవరం - పాకాల మార్గంలోని మదనపల్లి- ధర్మవరం

డబ్లింగ్ : మంచిర్యాల - పెద్దంపేట

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో డబ్లింగ్:
1. విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం/నిడదవోలు
2. గుంతకల్లు - తెనాలి - రేపల్లె

ఆదర్శ స్టేషన్లు : బొబ్బిలి, గూడూరు, లింగంపల్లి, నర్సారావుపేట, శంకరపల్లి, తాండూరు, వికారాబాద్

మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్సులు: ధర్మవరం, కరీంనగర్, కర్నూలు టౌన్, నెల్లూరు, నిజామాబాద్, విజయవాడ, జహీరాబాద్

సికింద్రాబాద్‌లో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు, వేగన్ల తయారీ కేంద్రం, 49 స్టేషన్లలో ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నల్గొండ, విజయవాడలలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.

విద్యుదీకరణ
గుంతకల్లు - బళ్లారి - హోస్పేట - వాస్కో డి గామా
విజయవాడ-నిడదవోలు(మచిలీపట్నం, నర్సాపురంల మీదుగా)
ఫలక్‌నుమా - ఉమ్‌దానగర్(పరిశీలనలో ఉంది)
సికింద్రాబాద్ - మేడ్చల్(పరిశీలనలో ఉంది)

సర్వేలు పూర్తయిన లైన్లు(వీటిని ఆమోదం కోసం ప్లానింగ్ కమిషన్‌కు పంపిస్తారు) :
1. భద్రాచలం - కొవ్వూరు, 2. భద్రాచలం రోడ్(కొత్తగూడెం) - విశాఖపట్నం, 3. కృష్ణా - వికారాబాద్, 4. మంత్రాలయం రోడ్ - కర్నూలు, 5. నిజామాబాద్ - రామగుండం, 6. హైదరాబాద్ - గజ్వేల్ - సిద్దిపేట - సిరిసిల్ల - జగిత్యాల, 7. పాండురంగాపురం - భద్రాచలం(సారపాక వరకు), 8. పటాన్‌చెరు - ఆదిలాబాద్, 9. జగ్గయ్యపేట - మిర్యాలగూడ, 10. కాచిగూడ - చిట్యాల, 11. జహీరాబాద్ - సికింద్రాబాద్.