
మాతృ దేవోభవ
రోజుకి 4గంటల పాటు మాత్రమే నిద్రపోతారామె. తెల్లారిలేవగానే ఆమె చేసే మొదటిపని తల్లి గాయత్రీదేవికి పాదాభివందనం చేయడం.
మనసు వెన్న: పేదల కష్టసుఖాలు వినడం చూస్తే ఆమెలో ఓ మాతృమూర్తి కనిపిస్తుంది అంటారు తెలిసిన వారు. వారు చెప్పే ప్రతి అక్షరాన్నీ పొల్లుపోకుండా ఓపిగ్గా వింటారు. మార్దవంగా స్పందిస్తారు.


చూపుల్లో చురుకుదనం...మాటలో కరుకుదనం...ఎవరికీ తలొంచనిమొండితనం...దేనికీ వెరవని గుండె ధైర్యం...అంతులేని ఆత్మవిశ్వాసం...అకుంఠిత సేవాభావం...నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడేమనస్తతత్వం...నిరాడంబర జీవితం...ప్రజాసేవే పరమార్థం.. ఇవన్నీ మమత సొంతం... నిర్మొహమాటంగా ఉండే ఆమెను కలకత్తా కాళికగా అభివర్ణిస్తుంటారు. సాదాసీదా మనస్తత్వం...సాధారణ జీవితమే ఆమె కిష్టం.