'రాజధాని' వేగంతో మమత ప్రసంగం
'రాజధాని' వేగంతో మమత ప్రసంగం
ఆద్యంతం సోనియా చిరునవ్వు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ప్రసంగం యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ మోముపై చిరునవ్వును నింపింది. ముఖంలో భావోద్వేగాలు ప్రతిబింబించకుండా జాగ్రత్తపడే సోనియా తొలిసారి తనివితీరా నవ్వారు. సభ్యుల రణగొణ ధ్వనులు.. విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తూ 'కోల్‌కతా దీదీ' తనదైన శైలిలో సంధించిన చమక్కులు రెండు గంటలపాటు సోనియాను నవ్వుల పూదోటలో షికారు చేయించాయి. 'రాజధాని' రైలులా వేగంగా సాగుతున్న మమత ప్రసంగానికి సభ్యులు పదేపదే అడ్డుతగిలారు.