Thursday, February 25, 2010

సోనీ కొత్త హోమ్‌ థియేటర్‌ సిస్టమ్‌

సోనీ కొత్త హోమ్‌ థియేటర్‌ సిస్టమ్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ సోనీ ఇండియా, తన హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌లో నూతన శ్రేణి ఉత్పత్తులను ఆవిష్కరించింది. 'డీఏవీ డీజెడ్‌' అనే ఈ నూతన శ్రేణిలో హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌ ఇంతకుముందు లేని యూఎస్‌బీ ప్లే, ఆడియో రిటన్‌ ఛానల్‌, డీవీడీ అప్‌ స్కేల్‌ సదుపాయాలతో లభిస్తున్నాయి. నాణ్యమైన శబ్దాన్ని అందించడంతో పాటు ఫుల్‌ హెచ్‌డీకి సమానమైన 1080పి రిజల్యూషన్‌ వీడియో స్టాండర్డ్‌ డెఫినిషన్‌ ఇన్‌పుట్‌ ద్వారా లభిస్తుందని సోనీ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. పాటలు, ప్లే చేసుకోవడమే కాకుండా రికార్డింగ్‌ సదుపాయం కూడా ఉంది. రూ.16,990 నుంచి రూ.29,990 వరకూ ధర ఉన్న ఈ హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌ నేటినుంచి తమ అన్ని విక్రయ కేంద్రాల్లో లభిస్తాయని సోనీ ఇండియా వెల్లడించింది.