వెల్లడిస్తున్న విజన్-2020

* వచ్చే 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి రైల్వే సొంతనిధుల నుంచి రూ.14 లక్షల కోట్లు (64శాతం) పెట్టుబడి.
* స్థూల జాతీయోత్పత్తిలో 1.2 శాతం (రూ.90వేల కోట్లు) గా ఉన్న రైల్వేల వాటాను వచ్చే పదేళ్లలో 3 శాతాని (రూ.2.70కోట్లు) కి పెంచడం.
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రతిఏటా కొత్తగా 2,500 కిలోమీటర్ల చొప్పున 2020 నాటికి కొత్తగా 25 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం. దీనికి తోడు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 11,985 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం.
* సరుకు, ప్రయాణికుల రవాణాకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు. దీని వల్ల ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్లుగా ఉన్న ప్రయాణికుల రవాణా వేగం 200 కిలోమీటర్లకు చేరుతుంది. అలాగే సరుకు రవాణా వేగం 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెరుగుతుంది.
* అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కచ్చితమైన ప్రణాళికతోరైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం.
* రైల్వేలో 10 శాతం పునరుత్పాదక ఇంధన వినియోగం ద్వారా వాతావరణ పరిరక్షణకు కృషి. తద్వారా కార్బన్ క్రెడిట్లను సాధించి అదనపు ఆదాయాన్ని సాధించడం.
* ప్రయాణికులకు అత్యుత్తమ సేవల్లో భాగంగా డబుల్ డెక్కర్ కోచ్‌ల నిర్మాణం, మరింత సౌకర్యవంతమైన స్లీపర్ క్లాస్ బోగీల రూపకల్పన, గ్రీన్ టాయ్‌లెట్స్ ఏర్పాటు, మొబైల్ టిక్కెట్ బుకింగ్ సదుపాయాల కల్పన.
* శాటిలైట్ అనుసంధాన రైల్వే లైను విధానం ద్వారా రైలు వచ్చే సమయాన్ని కచ్చితంగా గుర్తించడం, ప్రయాణికుల రవాణా బోగీల ఉత్పత్తి పెంపు వంటి అంశాల్లో సాహసోపేతమైన, నూతన విధానాలకు పెద్దపీట.
* 250-300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్ల కోసం 4 హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల నిర్మాణం. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా వివిధప్రాంతాలు, పారిశ్రామిక వాడలు, నౌకాశ్రయాలు, వాణిజ్య, పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే సేవల విస్తరణకు 8 కారిడార్ల ఏర్పాటు.
* రైల్వే సరుకు రవాణాను 50 శాతానికి పెంచడం.
* రైల్వే భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించడం, రైల్వే లైన్ల వెంట ఫైబర్ ఆప్టిక్ కేబుల్, సిగ్నలింగ్ టవర్ల ఏర్పాటుకు అనుమతుల ద్వారా టెలికాం, ఐటీ రంగాల నుంచి ఆదాయాన్ని ఆర్జించడం.
* ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సేవలు. రైల్వే నెట్‌వర్క్ ఆధునికీకరణ, విస్తరణ.
* కొత్త లైన్ల నిర్మాణానికి 50 శాతం పైగా నిధులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడితే అటువంటి లైన్లకు రైల్వే మిగిలిన నిధులు సమకూరుస్తుంది.
* ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సీఎస్‌ఐఆర్, డీఆర్‌డీఓ వంటి సంస్థల భాగస్వామ్యంతో రైల్వే మౌలిక సదుపాయాలు, సేవల్లో పోస్టుగ్రాడ్యుయేట్, డాక్టరేట్ డిగ్రీల స్థాయిని పెంచడం.