మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
లేడీస్ స్పెషల్ ఒకటి మరొకటి ప్యాసింజర్
ముంబయి -సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
రాష్ట్రం మీదుగా 6 భారత్ తీర్థ రైళ్లు
హైదరాబాద్ - న్యూస్‌టుడే

దూరప్రాంతాలకు 8 ఎక్స్‌ప్రెస్‌లు
(ద.మ.రైల్వేవి 3 సర్వీసులు)
1. హైదరాబాద్- అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండుసార్లు)
2. సేలం మీదుగా కోయంబత్తూర్-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (వారానికి మూడుసార్లు)
3. బెంగళూరు-తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ బంగారుపేట మీదుగా (వారానికి మూడుసార్లు)
4. మదురై- తిరుపతి ఎక్స్‌ప్రెస్ (వారానికి రెండుసార్లు)
5. తిరుపతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ మదనపల్లి మీదుగా (వారానికి రెండుసార్లు)
6. బెంగళూరు-హుబ్లీ హంపీ ఎక్స్‌ప్రెస్‌ను డీలింక్ చేసి బెంగళూరు-హుబ్లీ, బెంగళూరు-నాందేడ్‌కు స్వతంత్రంగా రైళ్లు నడుపుతారు
7. హరిప్రియ, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను డీలింక్ చేసి హైదరాబాద్ - తిరుపతి (రోజూ), హైదరాబాద్ -ఛత్రపతి సాహు మహరాజ్ టెర్మినల్ (ముంబయి)కు (వారానికి రెండు రోజులు) రైళ్లు నడుపుతారు. తిరుపతి- ఛత్రపతి సాహుమహరాజ్ టెర్మినల్ (ముంబయి)కు రోజూ రైలు ఉంటుంది.
8. సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్ (వారానికి మూడుసార్లు)
రాష్ట్రం మీదుగా 6 భారత్‌తీర్థ రైళ్లు
దేశవ్యాప్తంగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 16 భారతీతీర్థ రైళ్లలో ఆరు రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తాయి.
1. హౌరా-విశాఖపట్నం- హైదరాబాద్-విశాఖపట్నం- హౌరా
2. ముంబయి-పూణె-తిరుపతి-కాంచీపురం-రామేశ్వరం-మదురై
3. కన్యాకుమారి-పూణె-ముంబయి
4. పూణే-రత్నగిరి-గోవా-బెంగళూరు-మైసూరు-తిరుపతి-పూణే
5. మదురై-ఏరోడ్-పూణే-ఉజ్జయిని-వెరవల్-నాసిక్-హైదరాబాద్-చెన్నై-మదురై
6. మదురై-మైసూరు-గోవా-ముంబయి-ఔరంగాబాద్-హైదరాబాద్-మదురై
రైళ్ల పొడిగింపు
సికింద్రాబాద్-మన్మాడ్ (వారానికి రెండుసార్లు), కాకినాడ-మన్మాడ్ (వారానికోసారి), కాకినాడ-మన్మాడ్ (వారానికి రెండుసార్లు), విజయవాడ-మన్మాడ్ (వారానికోసారి) ఎక్స్‌ప్రెస్‌లు షిరిడీ వరకు, కాచిగూడ-నాందేడ్ (రోజూ) ఎక్స్‌ప్రెస్ అకోల వరకు, పర్లి-నిజామాబాద్ ప్యాసింజర్ పండరీపూర్ వరకు పొడిగించారు.
రైళ్ల రాకపోకల పెంపు
*హౌరా-యశ్వంతపూర్ దురంతో వారానికి 4 రోజులు
*కోర్బా-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు రోజులు
*విశాఖపట్నం-నిజాముద్దీన్ సమత ఎక్స్‌ప్రెస్ వారంలో 5రోజులు
*పాట్నా-బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ
ఈ ఏడాదిలో పూర్తయ్యే లైన్లు
*నోసమ్-బనగానపల్లి(నంద్యాల)-ఎర్రగుంట్ల
*జగిత్యాల-మోర్తాడ్(పెద్దపల్లి) -నిజామాబాద్
*గద్వాల - పాండురంగస్వామి (గద్వాల)- రాయచూరు
*ఖానాపూర్-హోమ్నాబాద్ (బీదర్)- గుల్బర్గా
*విష్ణుపురం-జాన్‌పహాడ్
ప్యాసింజర్ రైళ్లు
1.మిరాజ్-పర్లి ప్యాసింజర్
2.తిరుపతి-మదనపల్లె రోడ్డు-కురబలకోట
కొత్త ప్రాజెక్టులు
*సికింద్రాబాద్‌లో స్పోర్ట్స్ అకాడమీ
*పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో సికింద్రాబాద్‌లో వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీ.
మరో దురంతో రైలు
వారానికి రెండుసార్లు ్హముంబయి - సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది.
నాలుగు పుష్‌పుల్ రైళ్లు
1. తిరుపతి-నెల్లూరు-చెన్నై.
2. విజయవాడ-గుంటూరు-తెనాలి
3. కాచిగూడ-మహబూబ్‌నగర్
4. కాచిగూడ-మిర్యాలగూడ
లేడీస్ స్పెషల్
హైదరాబాద్ నగరంలో ఫలక్‌నుమా -లింగంపల్లి రూట్లో మహిళల కోసం ప్రత్యేకంగా మాతృభూమి స్పెషల్ రైలు (లోకల్‌ట్రైన్)
ప్రతిపాదిత రైల్వే లైన్లు
*ఆలమట్టి-యాద్‌గిర్, భద్రాచలం-కొవ్వూరు, భద్రాచలంరోడ్డు - విశాఖపట్నం, కృష్ణా-వికారాబాద్, మంత్రాలయం-కర్నూలు, నిజామాబాద్-రామగుండం, హైదరాబాద్ - గజ్వేల్-సిద్దిపేట-సిరిసిల్ల-జగిత్యాల, పాండురంగాపురం- భద్రాచలం, పటాన్‌చెరు-ఆదిలాబాద్, జగ్గయ్యపేట-మిర్యాలగూడ, కాచిగూడ-చిట్యాల, జహీరాబాద్-సికింద్రాబాద్, జల్నా-ఖమ్‌గాన్ రూట్లలో సర్వేలను వేగవంతం చేసి... ఆమోదం కోసం ప్రణాళిక సంఘానికి పంపుతారు.
*గిద్దలూరు-భాకరాపేట్, బాపట్ల-నిజాంపట్నం-రేపల్లె, మేళ్లచెరువు-జన్‌పహాడ్, పగిడిపల్లి-శంకరపల్లి, గడ్‌చందూర్-ఆదిలాబాద్ రూట్లలో కొత్త సర్వేలు చేపట్టాలని నిర్ణయించారు.
*భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రూట్లో కొత్త రైల్వే లైన్లును చేర్చారు.
*మాణిఘర్-గడ్‌చండూర్, గుంటూరు-గుంతకల్లు బోధన్ - బీదర్ రూట్లలో రెండులైన్ల ఏర్పాటుకు సర్వే
*మదన్‌పల్లి-ధర్మవరం-పాకాల రూట్లో గేజ్ మార్పిడి ఈ ఏడాదిలో పూర్తిచేస్తారు.
*కాజీపేట-బలార్ష రూట్లో మంచిర్యాల-పెద్దంపేట దగ్గర గోదావరి వంతెనపై మూడో రైల్వేలైను ఏర్పాటు పనులను ఈ బడ్జెట్‌లో చేర్చారు.
*గుంతకల్లు - బళ్లారి - హోస్‌పేట - వాస్కోడగామ రూటు విద్యుద్దీకరణ చేపట్టనున్నారు. విజయవాడ-నిడదవోలు, ఫలక్‌నుమా-ఉందానగర్, సికింద్రాబాద్-మేడ్చల్ రూట్లో విద్యుద్దీకరణపై అధ్యయనం చేస్తారు.
పీపీపీ పద్ధతిలో కొత్త రైల్వేమార్గాలు
ప్రభుత్వ-ప్రైవేటు పద్ధతి (పీపీపీ)లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దక్షిణమధ్య రైల్వే ఈ రూట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. వాడరేవు, నిజాంపట్నం ఓడరేవులకు పీపీపీ పద్ధతిలో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు ఈ కింది రైల్వే మార్గాలను కూడా ఇదే విధానంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు.
*నడికుడి-శ్రీకాళహస్తి * భద్రాచలం రోడ్డు - కొవ్వూరు
*మణుగూరు -రామగుండం * అక్కన్నపేట- మెదక్ - మేడ్చల్
*కొండపల్లి - కొత్తగూడెం * కంభం - ప్రొద్దుటూరు
*గద్వాల-మాచర్ల * విజయవాడ-గుడివాడ-బందరు-భీమవరం
*నర్సాపూర్-నిడదవోలు * గుంటూరు-తెనాలి-రేపల్లె