
ద్రవ్య లోటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతానికి మించదని చెప్పారు. ఇది ఎంతో అనుకూలించే అంశం. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. లోటు 7 శాతానికి మించిపోతుందని భయపడ్డాం. అదే సమయంలో వచ్చే రెండేళ్లలో 4.1 శాతానికి తగ్గించుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇది ముదావహం.
*దేశీయంగా వివిధ రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
*టెండరింగ్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా బొగ్గు గనులను విద్యుదుత్పత్తి సంస్థలకు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది విద్యుత్తు రంగానికి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పర్యావరణానుకూల విద్యుదుత్పత్తికి ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు.
నిరుత్సాహకర అంశాలు: ఉద్దీపన పథకాలను మరికొన్నాళ్లు, అంటే కనీసం మరో ఆరు నెలల పాటైనా కొనసాగించాల్సింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కాబట్టి, పూర్తి స్థిరీకరణ వచ్చేవరకూ ఆగుతారని ఆశించాం.
*మ్యాట్‌ను 15 శాతం నుంచి 18 శాతానికి పెంచడం పరిశ్రమలకు నష్టం చేసే చర్య.
*జీఎస్‌టీ ఆలస్యం కూడా నష్టదాయకమే.
*కొన్ని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించారు. రాష్ట్రానికి చెందిన కొన్ని నీటిపారుదల పథకాలు జాతీయ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాం. అదేవిధంగా 'వయబులిటీ గ్యాప్ ఫండింగ్' కింద రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి ఉంటే బాగుండేది. అటువంటివేమీ లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది.
మాలక్ష్మీ ఇన్‌ఫ్రావెంచర్స్ ఛైర్మన్, సీఐఐ-ఏపీ ఛైర్మన్