Thursday, February 25, 2010

మమతా ఎక్స్‌ప్రెస్ హైలెట్స్



మమతా ఎక్స్‌ప్రెస్ హైలెట్స్

కొత్తగా 54 రైళ్లు, 10 దురంతో ఎక్స్‌ప్రెస్‌లు.

ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని పర్యాటక క్షేత్రాలనుకలుపుతూ 'భారత్ తీర్థ్' రైళ్లు.
ముంబైలో కొత్తగా 101 సబర్బన్ సర్వీస్‌లు.
మహిళల కోసం 'మాతృభూమి' రైళ్లు.
వలస కార్మికుల కోసం కర్మ భూమి రైళ్లు.
హిమాచల్‌లోని బిలాస్‌పూర్ నుంచి కాశ్మీర్‌లోని 'లే' వరకు రైల్వేలైన్ పొడిగింపు.
కాశ్మీర్‌లో సోపోర్ వరకు లైన్ పొడిగింపు.
అండమాన్ నికోబార్‌లో పోర్ట్ బ్లెయిర్ నుంచి దిగ్లీపూర్ వరకు రైల్వేలైన్.
సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌కు రైల్వేతో అనుసంధానం.
2010-11లో కొత్తగా 1021 కిలోమీటర్ల కొత్త రైల్వేమార్గం ఏర్పాటు లక్ష్యం.
ప్రయాణికుల వసతుల కల్పనకు రూ.1302 కోట్లు కేటాయింపు.
మరో పది రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి.
94 ఆదర్శ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.
తిరువనంతపురం, అంబాలా, ఫరక్కా, అమేథీ, నాసిక్‌లలో వాటర్ బాటిలింగ్ ప్లాంట్‌లు. ప్రయాణికులకు చౌకగా శుభ్రమైన తాగునీరు. రైల్వే టైమింగ్, రిజర్వేషన్ స్టేటస్, వ్యాగన్‌ల కదలికపై ఎస్ఎంఎస్ అప్‌డేట్స్.
ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలు, ఐఐటీ, ఐఐఎంలు, జిల్లా కేంద్రాలు, గ్రామ పంచాయతీలలో మొబైల్ ఈ-టికెట్ కేంద్రాల ఏర్పాటు.
కాపలా లేని మొత్తం 13వేల రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఐదేళ్లలో ఉద్యోగుల నియామకం.
రైల్వే స్థలాల్లో 522 ఆస్పత్రులు, 60 పాఠశాలల ఏర్పాటు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రైల్వే పరిశోధన కేంద్రం ఏర్పాటు.
ప్రైవేటు పెట్టుబడులను వందరోజుల్లోపు ఆమోదించేలా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.
అటవీ భూముల్లో 10 రైల్ ఎకో పార్కులు.
ఆరు హైస్పీడ్ ప్యాసింజర్ కారిడార్స్‌పై జాతీయ హైస్పీడ్ రైల్ అథారిటీ ఏర్పాటు.
కామన్వెల్త్ గేమ్స్‌లో లీడ్ పార్ట్‌నర్‌గా రైల్వే.
బెంగాల్‌లోని హౌరా, భోల్‌పూర్‌లలో రవీంద్ర, గీతాంజలి మ్యూజియంలు.
బెంగళూరులో డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ సెంటర్.
గ్యాంగ్‌మెన్ కోసం ప్రత్యేక వసతులు.
విద్యుత్ ఆదా కోసం ఇప్పటికే 2.2 కోట్ల సీఎఫ్ఎల్ బల్బుల పంపిణీ.
సరుకు రవాణా కారిడార్‌ల ఏర్పాటు.
రైల్వే ప్రాజెక్టులకు స్థలాలు సేకరించేటప్పుడు.. నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదన.
80వేల కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా వసతి... ప్రత్యేక సంస్థల ఏర్పాటు.
విధాన నిర్ణయాల్లో కార్మిక సంఘాలకూ భాగస్వామ్యం.
పొదుపు చర్యల ద్వారా 2009-10లో రూ.2వేల కోట్ల ఆదా.
ముంబైలో వ్యాగన్ మరమ్మతుల కేంద్రం..