Friday, February 26, 2010

ఆర్థిక సర్వే 2009-10 భారత స్టాక్‌ మార్కెట్ల ఉత్తమ తీరు ప్రశంసనీయం

ఆర్థిక సర్వే 2009-21010

భారత స్టాక్‌ మార్కెట్ల ఉత్తమ తీరు ప్రశంసనీయం
Bombay-Stockన్యూఢిల్లీ : గత సంవత్సరం కాలంగా జోరుగా కొనసాగుతున్న భారత స్టాక్‌ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లలోనే రెండవ అత్యుత్తమ మార్కెట్లను ఆర్థిక సర్వే ప్రకటిం చింది. గడిచిన ఆరు సంవత్సారాలుగా భారత స్టాక్‌ మార్కెట్లు, ఇన్వెస్టర్లకు 199 శాతం రాబడులను అందిస్తూ ఉత్తమంగా ప్రదర్శిస్తున్నాయని తెలిపింది. ఆరు సంవత్సరాల కాల వ్యవధిలో డిసెం బరు 2009 నాటికి భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఒకటైన సెన్సెక్స్‌ బెంచ్‌మార్క్‌ సూచీ 17,465 పాయింట్లను తాకి 199శాతం పాజిటివ్‌ రిటర్న్‌లను ఇచ్చిందని సర్వే తెలిపింది.

ఇందులో ఇండోనేషియన్‌ స్టాక్‌ మార్కెట్లు పెట్టుబడిదారులకు అత్యుత్తమమైన రాబడులను ఇచ్చాయని పేర్కొంది. జకార్తా కాంపోజిట్‌ సూచీ 2,510 పాయింట్లతో 264శాతం రిటర్నులను నమోదు చేసిందని తెలిపింది. ఒక్క జపాన్‌ స్టాక్‌ మార్కెట్లు మాత్రం నెగటివ్‌ రిటర్న్‌లను మూటగట్టుకున్నాయి. ఈ వరుసలో చైనా స్టాక్‌ మార్కెట్లు మూడవ అత్యుత్తమ స్టాక్‌ మార్కెట్లుగా నిలిచాయి. 116శాతం రిటర్న్‌లను చైనా మార్కెట్లు నమోదు చేశాయి. దక్షిణ కొరియా 104శాతం, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు 74శాతం రాబడులను ఇచ్చాయని సర్వే తెలిపింది.