* ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. చేసే పని సమాజానికి ఉపయోగపడాలనే నిబంధన లేదు. కోట్ల రూపాయలు మట్టి పనుల్లో కలిసిపోతున్నాయి. గత ఏడాది వరకు 14.48 శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించారు.ఉపాధి స్వాహా పథకం జాతీయ ఉపాధి హామీ పథకం తన కీర్తి కిరీటంలో కలికితురాయి అని యూపీఏ ప్రభుత్వం అనుకుంటోంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా నిజంగా ఉపాధి కరవైన స్థితిలో ఉన్న శ్రామికులకే పని కల్పిస్తున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. మరోవైపు ఈ శ్రమ ద్వారా సమాజానికి ప్రయోజనం సిద్ధించేలా చెప్పుకోదగ్గ వనురులేమైనా సృష్టించారా? అంటే అదీలేదు. అవినీతి వూడలు దిగుతోందని పలుచోట్ల సామాజిక తనిఖీలో బయటపడింది.
* గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ నిధుల వినియోగంలో రాజస్థాన్ (89%), ఆంధ్రప్రదేశ్(83%), ఉత్తరప్రదేశ్(78%), జార్ఖండ్, మహారాష్ట్ర(57%), తమిళనాడు(56%) రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.ఇవి కూడా కేటాయించిన నిధుల్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు.
* అవసరమైన చోట ఉపాధి కల్పించలేకపోతున్నారు. వలసల్ని నిరోధించలేకపోతున్నారు. మరికొన్ని చోట్ల కూలీలను బతిమాలి పనులు చేయిస్తున్నారు.
ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితి...
గ్రామీణ కుటుంబాలు: 1.26 కోట్లు, జాబ్ కార్డులు: 1.17 కోట్లు.
2008-09లో ఖర్చు: రూ.2,963.90 కోట్లు
2009-10లో ఖర్చు (ఫిబ్రవరి 23నాటికి): 3,313.18 కోట్లు
* కేంద్ర వేలకోట్లు ఇస్తున్నా రాష్ట్రం సరిగా వినియోగించుకోవడం లేదు. ఇంతవరకూ రాష్ట్రంలో రూ.8182కోట్లు ఖర్చు చేశారు. పని కల్పించడమే దయాదాక్షిణ్యం అన్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నా
పక్షం రోజులకు ఒకదఫాఎక్కడా డబ్బులు పంపిణీ చేయడం లేదు. స్మార్ట్ కార్డులు సగం కూడా జారీ కాలేదు. చేసిన పనుల్లో 90 శాతం క్షేత్రస్థాయిలో వెతికితే కనిపించవు.
* గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.2,963 కోట్లు వ్యయం చేశారు. 10 శాతం స్వాహా అయినట్లు సామాజిక తనిఖీలో వెల్లడి అయ్యింది. మూడేళ్లలో రూ.4651 కోట్ల పనులు చేయగా రూ.1000 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని మరో అంచనా.
బడ్జెట్ ఏమిచ్చింది...!
ఈ పథకానికి 40,100 కోట్ల రూపాయలు కేటాయించారు. కిందటేడాది కన్నా రూ. వెయ్యి కోట్లు అదనం. దేశంలోని 4.5కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలన్నది లక్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న శ్రామిక కుటుంబాలకు అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాన్ని ఉపాధిహామీ కార్మికులకూ విస్తరిస్తున్నారు. ఉపాధి హామీ కింద 15 రోజులు దాటి పని చేసిన కార్మికులకు ఇది వర్తిస్తుంది.
