Friday, February 26, 2010

ఉపసంహరణలకే మొగ్గు..భవిష్యత్తు మనదే

ఉపసంహరణలకే మొగ్గు..భవిష్యత్తు మనదే

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఆహార ధరలు మరికొంతకాలం కొనసాగ వచ్చునని ఆర్ధిక సంఘం తేల్చి చెప్పింది. బలహీనమైన ఆహార విధానాల అమలే ధరల పెరుగుదలకు కారణమని, అలాగే ప్రజా పంపిణీ విధానం లో కూడా అనేక లోపాలు ఉన్నాయని ఎత్తి చూ పింది. గత సంవత్సరం డిసెంబరు లో ఆహారోత్పత్తు ల ధరలు గణనీ యంగా పెరిగాయని ఈ ధోరణి మరికొన్ని మాసాల వరకు కొనసాగే అవకాశం ఉందని ఆర్థికసర్వే వెల్లడించింది.


pranab-showingన్యూఢిల్లీ: 2010-11 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు విజయ కేల్కర్‌ నేతృత్వ వహించిన ఆర్ధిక సంఘం తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మరో నాలుగేళ్లలో భారత్‌ నాలుగు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా అవతరించ నున్న నేపథ్యంలో, మాంద్య పరిస్థితులు నిలవరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆర్ధిక సంఘం తనదైన శైలిలో ప్రతిస్పందించింది. 2010-11 ఆర్ధిక సంవత్సరం లో వృద్ధిరేటు 8.75 శాతం దాటవచ్చునని ఆర్ధిక సంఘం అం చనా వేయడం శుభ సంకేతాలను ముందుగా పంపు తోంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఆహార ధరలు మరికొంతకాలం కొనసాగ వచ్చునని ఆర్ధిక సంఘం తేల్చి చెప్పింది.

బలహీనమైన ఆహార విధానాల అమలే ధరల పెరుగుదలకు కారణమని, అలాగే ప్రజా పంపిణీ విధానం లో కూడా అనేక లోపాలు ఉన్నాయని ఎత్తి చూ పింది. గత సంవత్సరం డిసెంబరు లో ఆహారోత్పత్తు ల ధరలు గణనీ యంగా పెరిగాయని ఈ ధోరణి మరికొన్ని మాసాల వరకు కొనసాగే అవకాశం ఉందని ఆర్థికసర్వే వెల్లడించింది. దిగుమతి చేసుకున్న ముడి పంచదారను మార్కెట్లోకి సక్రమంగా విడుదల చేయకపోవడం కారణం గా చక్కెర ధరలు ప్రియమయ్యా యని ఆర్ధిక సంఘం విమ ర్శించింది. రానున్న కాలంలో కేంద్ర సర్కారు అమలు చే సే కొత్త విధానాల సామర్ధ్యంపై ధరల నియంత్రణ, స్థిరత్వం ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించింది.

నాలుగేళ్ళలో రెండంకెల వృద్ధి : సర్వే
ఆర్థిక సర్వేలో మరో నాలుగేళ్ళలో దేశం ఆర్థికంగా రెం డంకెల వృధ్ధిని సాధిస్తుందని భరోసా ఇచ్చారు. శరవే గం గా వృద్ధిచెందుతోన్న దేశాల సరసన భారత్‌ చేరనుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. 2009-2010 ఆర్థిక సంవ త్సరం మొదటి త్రైమాసికంలో సుమారు 5లక్షల మంది ఉపాధి అవకాశాలను పొందారని ప్రకటించింది. సర్వే ఆధారంగా 2010-2011 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 8.25శాతం నుండి 8.75శాతం మధ్యన ఉండవచ్చనే అంచనాను తెలిపింది. ఆ తరువాత 2011- 12 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 9శాతానికి పైగా ఉండవచ్చని తెలిపింది. 2011-12 సంవత్సరంలో సర్వీ సు రంగాల వృద్ధి 9శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. ఈ సర్వేలో ఉద్దీపన ప్యాకేజీలను త్వరగా ముగించాలని కూడా తెలిపింది.

ఎకై్సజ్‌, సేవా పన్నులు పెంచడం ద్వారా రాయితీలకు ముగింపు పలకాలని అభిప్రాయపడింది. ప్ర భుత్వ ఆర్ధిక సామర్ధ్యం పెరగాలంటే పన్నుల ద్వారా రాబ డి పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నివేదిక నొక్కి చెప్పింది. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనా ప్యాకేజీల కార ణంగా ఆయారంగాలు బాగా కోలుకున్నాయని, మాం ద్యం ప్రభావం నుండి బైట పడ్డాయని కాబట్టి దశలవారీగా రా యితీలను ఉపసంహరించుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించింది. ధరల పెరుగుదలపై అనేక కారణాలను చూపు తూ, సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ధరల పై నియంత్రణ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించ లేకపో తోందని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఆహారం, ఎరువు లు, కిరోసిన్‌, డీజిల్‌ విషయంలో ప్రభుత్వ చేతుల నుండి ధరల నియంత్రణను ఎత్తివేయాలని కోరింది.హెల్త్‌కేర్‌ వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ)లకు సంబంధించిన నియమాలను మరింత సులభతరం చేయా లని సూచించింది. 2008-09లో స్థూల జాతీయ పొదుపు జిడిపి 32.5 శాతంగా ఉందని, పెట్టుబ డులు 34.9 శాతంగా ఉన్నాయని తెలిపింది.

పది సంవత్సరాల క్రితం ఈ ప్రగతి కేవలం ఒక కల గానే ఉండేదని పేర్కొంది. చైనా తరువాత మాంద్య ప్రభావాన్ని అతి తక్కువగా ఎదుర్కొన్న దేశం మనదేనని తెలిపింది. వ్యవసాయోత్పత్తులను పెంచడానికి సమగ్రత తో కూడిన సమన్వయ విధానాలను అనుసరించాలని, వ్యవసాయ ప్రగతి ద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధిం చాలని భావిం చింది. వ్యవసాయోత్పత్తి పెరుగుదల, విని యోగం సక్రమంగా జరగాలని సూచించింది. మాంద్యం బారి నుండి తప్పించుకుని పారిశ్రామిక ప్రగతి గత ఏడాది డిసెంబర్‌ నాటికి 16 శాతానికి చేరిందని తెలిపింది. టెలి కాం రంగంలో పన్ను విధానాన్ని మరింత పటిష్ట పరచాలని కోరింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లోనే రుణ వితరణ అధికంగా ఉందని కితాబునిచ్చింది. పెన్షన్ల రంగంలో సంస్కరణలు తేవాలని కోరింది.