Friday, February 26, 2010

బడ్జెట్‌ ముఖ్యాంశాలు 2010-11

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

* గత డిసెంబర్‌ నాటికి ఉత్పాదక రంగంలో 18.5 శాతం వృద్ధి
* ప్రాథమిక విద్యకు నిధుల పెంపు
* ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది
* కరవు, వాతావరణ మార్పులతో ఆహారధాన్యాల దిగుబడి తగ్గింది
* స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులు
* జీఎస్‌టీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
* ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత
* ప్రత్యక్ష పన్నుల్లో నూతన విధానం అమలుకు నిర్ణయం
* సులభతరమైన పన్నుల విధానం తెచ్చేందుకు ప్రయత్నం
* పోషక ఆధారిత ఎరువుల విధానం ఏప్రిల్‌ నుంచి అమలు
* ఎరువులు సబ్సిడీని క్రమబద్ధీకరించడమే కొత్త విధాన లక్ష్యం
* పోషక ఆధారిత ఎరువుల విధానంలో రైతులకే నేరుగా సబ్సిడీ
* ఎఫ్‌డీఐ విధానాల ఏకీకృతం
* ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి కౌన్సిల్‌ ఏర్పాటు
* మరిన్ని ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి
* ప్రత్యక్ష పన్ను కోడ్‌, జీఎస్‌టీలు 2011 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
* 2009-10 ఆర్థిక సంవత్సరంలో 209. బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
* రూ. 2 వేట కోట్లతో తూర్పుప్రాంతంలో రెండో హరిత విప్లవం
* 2009-10 లో సెజ్‌లలో ఎగుమతుల వృద్ధిరేటు 120 శాతం
* ప్రీషిప్‌మెంట్‌ రుణాలపై వడ్డీ రాయితీ రంగాల పొడిగింపు
* వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత
* మెట్టప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ పథకాలకు ప్రాధాన్యత
* భూసార పరిరక్షణ, నీటియాజమాన్య నిర్వహణకు ప్రాధాన్యత
* పర్యావరణ అనుకూల వ్యవసాయానికి రూ. 200 కోట్లు
* వ్యవసాయ రుణాల చెల్లింపు వ్యవధి ఆర్నెల్లు పొడిగింపు
* వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 3 లక్షల 75 వేల కోట్లు
* వ్యవసాయ రుణాలకు గతేడాదికన్నా రూ. 50 వేల కోట్లు పెంపు
* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అభివృద్ధి
* ప్రైవేటు గిడ్డంగుల లీజు ఐదేళ్ల నుంచి ఏడేళ్లకు పెంపు
* ఆహారధాన్యాల నిల్వలకు ప్రైవేటు భాగస్వామ్యంతో గోదాములు
* మెట్టప్రాంతంలో నీటి సరఫరా కోసం రూ. 2,400 కోట్లు
* సగటున రోజుకు 20 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం
* గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు 20.9 బిలియన్‌ డాలర్లు
* ఎఫ్‌డీఐ విధానాలు ఏకీకృతం
* విద్యుత్‌ రంగానికి రూ. 5,134 కోట్లు
* 2020 నాటికి 20 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
* కోల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు
* సాంప్రదాయేతర ఇంధన విద్యుత్‌కు వెయ్యి కోట్లు
* జాతీయ విద్యుత్‌ విధానానికి రూ. 5,930 కోట్లు
* రహదారుల నిర్మాణానికి రూ. 19,894 కోట్లు
* రైల్వేల అభివృద్ధికి రూ. 16,752 కోట్లు
* ఢిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి సిద్ధం
* ఐఐఎఫ్‌సీ ద్వారా 2011 మార్చినాటికి 20 వేల కోట్ల పెట్టుబడి రుణాలు
* గంగానది ప్రక్షాళనకు రూ. 500 కోట్లు
* పర్యావరణ హిత వ్యవసాయ పరిశోధనకు రూ. 200 కోట్లు
* తిరువూరు ఎగుమతుల ప్రాంతంలో కాలుష్య నివారణకు రూ. 200 కోట్లు
* గోవా బీచ్‌ల పరిరక్షణకు రూ. 200 కోట్లు
* కోల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు
* రెండు వేల జనాభా కలిగిన ప్రతి గ్రామానికి బ్యాంకింగ్‌ సేవలు
* 6-14 ఏళ్లలోపు పిల్లలకు నాణ్యమైన విద్య
* ఆరోగ్య రంగానికి రూ. 22,300 కోట్లు
* గ్రామీణ, నగరాల్లో మౌలిక వసతులకు రూ. 1,73,552 కోట్లు
* గ్రామీణ అభివృద్ధికి రూ. 66,100 కోట్లు
* గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40,100 కోట్లు
* ఇందిరా ఆవాస్‌ యోజనకు రూ. 10 వేల కోట్లు
* మైదాన ప్రాంతాల్లో ఐఏవై యూనిట్‌ విలువ రూ. 45 వేలు
* కొండప్రాంతాల్లో ఐఏవై యూనిట్‌ విలువ రూ. 48 వేలు
* గోవా స్వర్ణ జయంతి జాతీయ రహదారికి రూ. 200 కోట్లు
* భారత్‌ నిర్మాణ్‌కు రూ. 48 వేల కోట్లు
* ఎస్‌జేఆర్‌వై కింద పట్టణాభివృద్ధికి రూ. 5,400 కోట్లు
* ఎస్‌జేఆర్‌వై కింద పట్టణ పేదరిక నిర్మూలనకు రూ. వెయ్యి కోట్లు
* ప్రభుత్వ రుణాలపై ఆర్నెల్లలో శ్వేతపత్రం
* ఆర్‌ఏవై కింద పట్టణ పేదల గృహనిర్మాణానికి రూ. 1270 కోట్లు
* మురికివాడల నిర్మూలనే భారత్‌ లక్ష్యం
* ఖాదీ సంస్కరణలకు ఏడీబీతో ఒప్పందం
* ప్రభుత్వ బ్యాంకులకు 2010-11లో రూ. 16,500 కోట్లు
* మైనార్టీ సంక్షేమానికి రూ. 2,600 కోట్లు
* మహిళా రైతుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకం
* విశిష్ట గుర్తింపు కార్డుల పథకానికి రూ. 1900 కోట్లు
* నందన్‌ నిలేకని ఆధ్వర్యంలో సాంకేతిక సలహా సంఘం
* రక్షణ రంగానికి రూ. 1,47,340 కోట్లు
* రెండు వేల మంది సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్ల నియామకం
* స్వాస్థ్య బీమా యోజన ఎన్‌ఆర్‌ఈజీఏ లబ్ధిదారులకు వర్తింపు
* అసంఘటిత రంగ కార్మికుల ఫించన్ల కోసం రూ. 1000 కోట్లు
* సామాజిక వెనుకబడిన వర్గాలకు రూ. 4000 కోట్లు
* రక్షణశాఖకు రూ. 1,47,354 కోట్లు
* పారామిలిటరీలో రెండు వేలమందికి అవకాశం
* న్యాయసేవలు అందించేందుకు ప్రత్యేక సంస్థ
* నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* లద్దాఖ్‌లో సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లకు రూ. 500 కోట్లు
* వ్యాపారులకు 60 లక్షల వరకూ ఆడిట్‌ మినహాయింపు
* వృత్తి నిపుణులకు 15 లక్షల వరకూ ఆడిటింగ్‌ మినహాయింపు
* సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌ పరికరాల దిగుమతిపై సుంకం తగ్గింపు
* వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ప్రాసెసింగ్‌కు రాయితీలు
* వ్యవసాయ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పౌల్ట్రీ పరికరాల దిగుమతికి రాయితీ, ధరలు తగ్గే అవకాశం
* విత్తనాలకు సేవా పన్ను మినహాయింపు
* ఎలక్ట్రిక్‌ కార్లు, వాహనాలకు ఎక్సైజ్‌ సుంకాల మినహాయింపు
* సోలార్‌ రిక్షాకు 4 శాతం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు
* పెట్రోలియేతర ఉత్పత్తులపై 2 శాతం ఎక్సైజ్‌ సుంకం
* ముడిచమురుపై 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ
* డీజిల్‌, పెట్రోల్‌పై 7.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ
* ఇతర శుద్ధి ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీ
*రూ. పదిలక్షల లోపు గృహరుణాలపై 1 శాతం వడ్డీ తగ్గింపు మరో ఏడాది పొడిగింపు.