Thursday, February 25, 2010

రైల్వే స్థలాల్లో ఆస్పత్రులు

రైల్వే స్థలాల్లో ఆస్పత్రులు
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: రైల్వే బడ్జెట్‌లో సుమారు 400 ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైల్వే మిగులు స్థలాల్లో, కేంద్ర ఆరోగ్య శాఖ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో రాష్ట్రానికి టెరిటరీ లెవెల్‌ (ప్రాంత్రీయ స్థాయి)లో రెండు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు లభించాయి. వీటిని నల్గొండ, విజయవాడల్లో ఏర్పాటు చేస్తారు. ద్వితీయస్థాయి జనరల్‌ స్పెషాలిటీ ఆస్పత్రులనుఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్డు, భీమవరం జంక్షన్‌, ధర్మవరం, ఏలూరు, గోటి, కాకినాడ పోర్టు, మచిలీపట్నం, మహబూబ్‌నగర్‌, పాకాల, పాలకొల్లు, పలాస, సికింద్రాబాద్‌, తణుకు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంల్లో ఏర్పాటు చేస్తారు.

ఔట్‌ పేషెంట్‌, డయగ్నొస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటయ్యే ప్రాంతాలు..: ఆదోని, అనంతపురం, అన్నవరం, బంగారపేట్‌, బాపట్ల, భద్రాచలం రోడ్డు, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, డోన్‌, గూటీ, గూడురు, గుంతకల్లు, హిందూపురం, కాకినాడ టౌన్‌, ఖమ్మం, మచిలీపట్నం, మహబూబ్‌నగర్‌, మహబుబాబాద్‌, మంత్రాలయం రోడ్డు, నడికుడి, నల్గొండ, నంద్యాల, నెల్లూరు, నిడదవోలు, నిజామాబాద్‌, ఒంగోలు, పాకాల, పాలకొల్లు, రాజమండ్రి, సికింద్రాబాద్‌, సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, తాండూరు, తణుకు, తెనాలి, వికారాబాద్‌, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్‌ ఉన్నాయి.

ఇవే ఆదర్శ స్టేషన్లు..: ఆధునికీకరించనున్న 94 రైల్వే స్టేషన్లలో రాష్ట్రానికి చెందిన బొబ్బిలి, గూడూరు, నర్సరావుపేట, లింగంపల్లి, రఘునాథ్‌పూర్‌, శంకర్‌పల్లి, తాండూరు, తిరువరూరు, వికారాబాద్‌ ఉన్నాయి.

బహుళ ప్రయోజన సముదాయాల ఏర్పాటు: దేశంలో మొత్తం 93 బహుళ ప్రయోజన సముదాయాలు (మల్టీ-ఫంక్షనల్‌ కాంప్లెక్స్‌)ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ధర్మవరం (పుట్టపర్తి వద్ద), కరీంనగర్‌, కర్నూల్‌ టౌన్‌, నెల్లూరు, నిజామాబాద్‌, శ్రీకాకుళం రోడ్డు, విజయవాడ, విజయనగరం జంక్షన్లలో వీటిని నిర్మిస్తారు.