Thursday, February 25, 2010

మెగా ప్రాజెక్టుల్లో పీపీపీకి మరింత మద్దతు: అతుల్‌ పంజ్‌

మెగా ప్రాజెక్టుల్లో పీపీపీకి మరింత మద్దతు
అతుల్‌ పంజ్‌
'గత రెండేళ్లు గడ్డుకాలం. ఆర్థిక మందగమనం కారణంగా ప్రతి రంగంలోనూ పెట్టుబడులు కుదించుకుపోయాయి. అయితే ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ బోలెడంత సానుకూల దృక్పథాన్ని కనబరుస్తోంది. మందగతి నుంచి కోలుకొనే ప్రక్రియ మొదలైంది.. ప్రభుత్వం ఆశాజనకమైన వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆశాభావంతో పారిశ్రామిక వర్గాలు వేచి ఉన్నాయి. ప్రపంచమంతా భారత దేశం వైపు చూస్తున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన/ నిర్మాణ రంగ పురోగతిని సాధించటం కీలకంగా మారింది. కామన్‌వెల్త్‌ క్రీడల వంటి అంతర్జాతీయ సంఘటనలకు మన దేశం వేదికగా ఉంది. మెట్రో రైల్‌/మోనో రైల్‌ల వంటి పథకాలను చేపడుతూ పట్టణీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాం. అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టులు, ఆనకట్టలు, ఎక్స్‌ప్రెస్‌ వేలు, విమానాశ్రయాల ఆధునికీకరణ, భారీ నిర్మాణ పథకాలు ఇవాళ నవ భారతావని అభివృద్ధికి చోదకశక్తులు కానున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాన్ని జీడీపీలో 5% నుంచి 9 శాతానికి పెంచి కేంద్రం చొరవ తీసుకొంది. ఇది రానున్న అయిదు సంవత్సరాల్లో రూ.50,000 కోట్ల పెట్టుబడిగా లెక్క తేలుతుంది. మేం ఈ బడ్జెట్‌ నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే.. మెగా ప్రాజెక్టుల్లో ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని(పీపీపీ) ప్రోత్సహించాలి. ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. పరిశ్రమ వృద్ధికి దోహదం చేసే చర్యలు సాధారణ బడ్జెటులో ఉంటాయని భావిస్తున్నాం. ఇంజినీరింగ్‌ పరిశ్రమలో భాగంగా ఉన్న మా కంపెనీ మౌలిక సదుపాయాల మంజూరులో ప్రభుత్వం నుంచి వరాలు లభిస్తాయని కోరుకుంటోంది'.