Friday, February 26, 2010

ఒత్తిళ్ళు ఉన్నా... రాష్ట్రాల వాటా పెంచాం

ఒత్తిళ్ళు ఉన్నా... రాష్ట్రాల వాటా పెంచాం

న్యూఢిల్లీ: ఆర్థిక ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతానికి పెంచుతూ 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసును ప్రభుత్వం ఆమోదించిందని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గతంలో రాష్ట్రాల వాటా 30.5 శాతంగా ఉండేది. సమాఖ్య విధాన విసృ్తత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రాలు 3.19 లక్షల కోట్ల మేరకు గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా పొందనున్నట్లు పేర్కొన్నారు. జీఎస్‌టీ అమల్లోకి వస్తే రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి గాను రూ. 50 వేల కోట్లు కేటాయించాల్సిందిగా కూడా కమిషన్‌ సిఫార్సుచ ేసింది.

2009-10 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు 6.8శాతంగా ఉండగలదని భావిస్తున్నారు. గత ఏడాది ఇది 6.2 శాతంగా ఉండింది. ప్రాధాన్య రంగాలకు నిర్దిష్ట కేటాయింపులు చేయాల్సిందిగా కూడా కమిషన్‌ సిఫార్సు చేసింది. ప్రాథమిక విద్యకు రూ. 24 వేల కోట్లు, పర్యావరణానికి రూ. 15 వేల కోట్లు కేటాయించాల్సిందిగా కమిషన్‌ సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల పటిష్ఠానికి రూ.87 వేల కోట్లు కేటాయించాల్సిదిగా కూడా సూచించింది. కేంద్రపన్నుల్లో స్థానిక సంస్థలు కూడా వాటా పొందగలగడం ఇదే తొలిసారని ప్రణబ్‌ అన్నారు.

ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 8.5 శాతంగా ఉండగలదని కమిషన్‌ అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం కారణంగా దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.7 శాతానికి పడిపోయింది. అంతకు ముందు మూడేళ్ళ పాటు ఇది 9 శాతంగా ఉండింది. కమిషన్‌ చేసిన ముఖ్యమైన సిఫారసులన్నింటినీ ప్రభుత్వం ఆమోదించినట్లుగా ప్రణబ్‌ తెలిపారు. గత ఏడాది కాలంగా ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతూ వచ్చిందన్నారు. అనిశ్చితి నుంచి ఆత్మవిశ్వాసం వైపు పురోగమనం ఆ రంభమైందని వ్యాఖ్యానించారు. ఈ సర్వే ఆర్థిక విశ్లేషణను మాత్రమే గాకుం డా, మరెన్నో నూతన ఆలోచనలను కూడా అందించిందని, భవిష్యత్తు విధాన రూపకల్పనపై చర్చకు అవి నాంది పలుకుతాయని అన్నారు.

ముగింపులో ఓ శుభపరిణామం: ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదన్న సా నుకూల సంకేతాలతో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నదని ఆర్థిక మంత్రి ప్ర ణబ్‌ ముఖర్జీ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 8.5 శాతం గా ఉండగలదని ఆయన అన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఎంతో ఆశాజనకంగా ఆరంభమవుతోందని పేర్కొన్నారు. 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదికను పా ర్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆదాయపు పన్ను భారం తగ్గించండి: తాము ఆర్జించే లాభాలపై విధిస్తున్న 30 శాతం ఆదాయపు పన్నులో కొంత మినహాయింపు ఇవ్వాలని పట్టణ సహకార బ్యాంకులు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీని అభ్యర్థించాయి.