దేశంలో మొబైల్ ఫోన్ వినియోగదారులు దూసుకుపోతున్నారు. మార్చిలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల మంది కొత్తగా ఈ ఫోన్ కనెక్షన్లు తీసుకున్నారని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. దీంతో దేశంలో ఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య ప్రతి 100 మందిలో 53కి చేరింది.

58.4 కోట్లు: మార్చిలో పెరిగిన కనెక్షన్లతో దేశంలో మొబైల్ చందాదారుల విస్తృతి మరో 3.6% మేర పెరిగి 56.4 కోట్ల నుంచి
58.43 కోట్లకు చేరింది.
3.7 కోట్లు: దేశంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య మార్చిలో కూడా
3.7 కోట్లుగానే ఉంది. వినియోగదారుల సంఖ్యలో పెద్దగా మార్పులు కనిపించలేదు.
62 కోట్లు: ్లకొత్త వినియోగదారులతో దేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య (వైర్+వైర్‌లెస్) 62.12కోట్లకు ఎగసింది.అంతకు ముందు ఫిబ్రవరిలో సంఖ్య 60 కోట్లుగా ఉంది.
