కపారో కారు ఉపక రణాల తయారీ నుండి లోహ పరిశ్రమకు ప్రస్థానాన్ని ప్రారంభించిన పాల్ 2008లోనే తన ఆస్తులను 861 మిలియన్ పౌండ్లకు పెంచుకున్నారు. పాల్ రుణాలు 6.4 మిలియన్ పౌండ్లకు, పన్నుకు ముందు నష్టం 3 మిలియన్ పౌండ్లకు చేరింది. ఆయన కుమారుడు వ్యాపార లావాదే వీలు చూస్తుండగా, పాల్ మాత్రం హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ఎం జాయ్ చేస్తుంటారు. గత ఏడాది పారిశ్రామికవేత్తలందరూ మాంద్యం కోరలలో చిక్కుకున్నప్పటికి, జాబితాలోని వెయ్యి మంది తమ సంపదను 30 శాతం పెంచుకోవడం విశేషం. వెయ్యి మంది ఉన్న జాబితాలో బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది పది నుండి 53కు పెరిగింది.

బ్రిటన్ భాగ్యవంతుల జాబితా లో 245వ స్థానంలో ఉన్న ఎలిజబెత్ రాణి వ్యక్తి గత సంపద 20 మిలియన్ పౌండ్లు పెరిగి 290 మిలియన్ పౌండ్లకు చేరింది. హ్యారీ పాటర్ హీరో డేనియల్ ర్యాడ్‌క్లిఫ్ (20) అతి పిన్న వయస్కుడైన కుబేరుడిగా 42 మిలియన్ పౌండ్లతో జాబితాలో చోటు సంపాదించాడు. వెయ్యి మం ది బ్రిటన్ భాగ్యవంతులు, 250 ఐర్లాండ్ సంపన్ను లతో జాబితా విడుదలైంది. మరో సంపన్న భారతీయ పారి శ్రా మిక కుటుంబమైన హిందు జాలకు ఈసారిలో జాబి తాలో స్థానం లేకపోవడం విశేషం.
అంబానీ సోదరులను ఉమ్మ డిగా 27.2 బిలియన్ డాలర్లతో ఐదవ స్థానంలో నిలి పిన 50 మంది ప్రపంచ కుబే రుల పేర్లు కూడా ఈ తాజా జాబి తాలో కనిపించలేదు. మరో11రోజులలో బ్రిటన్‌లో సార్వ త్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సండే టైమ్స్ కుబ ేరుల జాబితా ప్రకటించడం విశేషం. ఏ పార్టీ అధికా రం లోకి వచ్చినా పబ్లిక్ వ్య యం తగ్గించుకోవడం, పన్నులు పెరగడం తప్పని పరిస్థితి బ్రిటన్‌లో ఉంది. మాంద్యం రో జులలో ఇంత త్వరగా భాగ్యవంతులు ఎదిగిపోవడం ఎన్ని కల ప్రచారంలో చర్చనీయాంశం అయింది. జాబితా లో అగ్ర భాగాన ఉన్న లక్ష్మీ నివాస్ మిట్టల్ కంపెనీ షేర్ల ధరలు తక్కువ స్థాయిలో ఉండగా, ఆస్తుల విలువ కేవలం 10.8 బిలియన్ పౌండ్లుగా ఉంది. షేర్లు ధరలు పెరిగి ఆయన ఆ స్తుల విలువ 22.45 బిలియన్ పౌండ్లకు చేరడం విశేషం.