జుత్తు సంరక్షణ క్రీమ్‌కే రూ.125 కోట్లు
ముఖానికి రాసే క్రీములకు రూ.120 కోట్లు
![]() ఈ పిలుపు కోసం పరితపించే మగ మహరాజులెందరో! బాహ్య సౌందర్యాన్ని పెంచుకోవడం ద్వారా నలుగురిలోనూ తమ ప్రత్యేకతను ప్రదర్శించేందుకు వీరు ఖర్చుపెట్టేది తక్కువేం కాదు సుమా! జిమ్‌లలో దేహ దారుఢ్యాన్ని పొందడంతో పాటు ముఖ వర్చస్సు మెరుగుకు, జుట్టును ఆకర్షణీయంగా మలచుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. దీన్ని చక్కటి వ్యాపార అవకాశంగా మలుచుకుని వినూత్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. మూడు ఉత్పత్తులు ఆరు సేవలుగా వర్ధిల్లుతున్న పురుష ప్రధాన సౌందర్య వర్ధక రంగంపై పట్టు బిగించేందుకు ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలోని పలు ప్రముఖ సంస్థలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటివరకు మహిళల సౌందర్య సాధనాల తయారీకే పరిమితమైన పలు సంస్థలు, ఇప్పుడు పురుషులు ఉపయోగించదగ్గ ఉత్పత్తి శ్రేణిపై దృష్టి సారించాయి. కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. ఇమామీ తొలి అడుగు ప్రచారంలో వినూత్న పోకడలు *తాము ఉత్పత్తి చేస్తున్న 'ఎవర్‌యూత్ మెన్జ్' బ్రాండ్‌కు ప్రచారం కల్పించేందుకు జైడస్ క్యాడిలా కంపెనీ కూడా మరో వెబ్‌సైట్‌కు అంకురార్పణ చేసింది. ఇందులో నో యువర్ స్కిన్, చర్మ సంరక్షణపై సందేహాల నివృతి, వైద్య నిపుణుల సలహాలు వంటి ఎంపిక (ఆప్షన్)లు అదనంగా లభిస్తున్నాయి. పురుషుల చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి, మెరుపునిచ్చే క్రీమ్ (స్క్రబ్)ను ప్రవేశపెట్టిన ఘనత తమదేనని జైడస్ క్యాడిలా ప్రకటించుకుంది. దీంతో పాటు ఫేస్‌వాష్, సన్ బ్లాక్, మాయిశ్చరైజర్‌లనూ ఈ కంపెనీ విడుదల చేసింది. *గోద్రేజ్ సారా లీ జుత్తు సంరక్షణ ఉత్పత్తులను పరిచయం చేసింది. 'బ్రై క్రీమ్ హైబ్రిడ్జ్' పేరుతో క్రాఫ్‌ను చెక్కు చెదరనీయకుండా ఉంచే ఓ ఉత్పత్తిని గతేడాది విడుదల చేసింది. మగవారి జుత్తు సంరక్షణ విభాగంలోనే రూ.125 కోట్ల వ్యాపారం సాధ్యమని ఒక అంచనా. *మరో ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం యూనిలీవర్ 'డవ్ మెన్ + కేర్' పేరుతో జంట ఉత్పత్తులను(కలెక్షన్స్) ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దాని బాటనే ఎల్డర్ హెల్త్‌కేర్ అనుసరిస్తూ వీఎల్‌సీసీతో కలిసి 'ఫ్యూయల్ ఫర్ మెన్' శ్రేణి పూర్తి స్థాయి పురుష సౌందర్య ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. |
![]() *భారతీయ పురుషులను నవ మన్మథులుగా మార్చివేసే సాధనాలు, సౌందర్యశాలల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.9,200 కోట్లు. *మగవారి శారీరక సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల వాణిజ్య విభాగం ఏటా 20-25 శాతం మేర వృద్ధిని కనబరుస్తోందంటున్నారు పరిశ్రమ నిపుణులు. *ప్రపంచంలో గతేడాది నాటికి ఈ పరిశ్రమ వ్యాపారం 19.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రానున్న అయిదేళ్లలో 28 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. |