దేశంలో నిర్మాణ రం గం శరవేగంగా విస్తరి స్తుండటంతో దీనికి అను బంధంగా ఉండే రంగాల న్నీ కూడా అద్భుత మైన ప్రగతి సాధిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పు కోవాల్సింది ఇనుము, ఉక్కు పరిశ్రమ. భవన నిర్మాణాలలో పటిష్ఠతకు పెద్ద పీట వేస్తారు. ఇందుకు గాను మంచి నాణ్యతగలిగిన ఉక్కును వినియోగి స్తారు. సరిగ్గా ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని... ఇనుము, ఉక్కు ఉత్పత్తి లో తనదైన శైలిలో దూసుకెళ్లిపోతూ అగ్రపథాన్ని అందుకున్న సంస్థ ఎమ్‌ఎస్‌పి స్టీల్ అండ్ పవర్.
1968 సంవత్సరంలో ఆధునిక్ రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ప్రారంభిం చబడిన ఈ అతి చిన్న కంపెనీ 2003 వ సంవత్సరంలో ఎమ్‌ఎస్‌పి స్టీల్ పవర్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించింది. సన్నాహాల్లో భాగంగా 2 (296,000) లక్షల టన్నుల స్పాంజి ఐరన్ ప్లాంటును, సొం త అవసరాలకు 16 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును, 95,109 టన్నుల వార్షిక సామ ర్థ్యంతో స్టీల్ మెల్టింగ్ షాపును, ద్విపాద బిలె్లట్ క్యాష్టర్‌ను, 80 వేల టన్నుల వార్షిక సామర్థ్యం తో రోలింగ్ మిల్లును స్థాపిం చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు అవసరమైన 100 కోట్ల నిధులలో 62 కోట్లు బ్యాంకులు టర్మ్‌లోన్‌గా సమ కూర్చగా 22 కోట్లను కంపెనీ ఈక్విటీ మూలధనం మరియు అంతర్గత వనరుల నుంచి సమీకరించారు. మిగిలిన 16 కోట్ల రూపాయలను 2005 సంవత్సరం జూన్ మాసంలో రూ.10 ముఖవిలువ కలిగిన 1 కోటి 60 లక్షల షేర్లను ముఖవిలువకే ప్రజలకు (పబ్లిక్ ఇష్యూ) జారీ చేయడం ద్వారా సమీకరించారు.ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు పరిపూర్ణంగా కార్యరూపం దాల్చడానికి అనుబంధంగా 5,76,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో కోల్ వాషరీని అదనంగా 8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని, ముడిపదార్ధాల దిగుమతికి తయారైన ఉత్పత్తుల ఎగుమతికి అనుకూలంగా ఉండడానికి 2.4 కిలోమీటర్ల రైల్వే సైడింగ్‌ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధపరి చారు. ఇందుకు కావలసిన 25 కోట్ల రూపాయలను సంస్థాగత పెట్టుబడి దారుల నుంచి, 10 కోట్ల రూపాయలను ఈక్విటీ రూపంగా, 15 కోట్ల రూపాయ లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సమీకరించడానికి నిర్ణయించారు.
పూరన్‌మల్ అగర్వాల్ ఈ గ్రూపు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తమ్ముడు సురేష్‌కుమార్ అగర్వాల్ మొత్తం ప్రాజెక్టులన్నింటికీ కావల్సిన సాంకేతిక సహకారం అందిస్తూ అన్నకు చేదోడువాదోడుగా ఉంటారు. వీరి కుమారులు మనీష్, సాకేత్ ఇద్దరూ ఎంబీఏలు పూర్తిచేసి మార్కెటింగ్ రంగంవైపు దృష్టి సారించడంతో పాటు ప్రాజెక్టులన్నీ సకాలంలో శరవేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తుంటారు. ఇక గ్రూపులో నిపుణులైన ఉద్యోగుల సహకారం ఎటూ ఉండనే ఉండటంతో దేశంలోనే అగ్రస్థాయికి చేరుకునే దిశగా ఎంఎస్‌పీ గ్రూపు పరుగులు తీస్తోంది.
ఆర్థిక ఫలితాలు
2008-09 సంవత్సర ఆర్థిక ఫలితాలు పరిశీలించి నటై్లతే కంపెనీ పన్ను తర్వాత 40 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. అదే విధంగా 20 09-10 ఫలితాలను అంచనా వేసినటై్లతే 30 కోట్ల రూపాయల లాభాన్ని అం చనా వేయవచ్చు. 58 కోట్ల రూపాయల ఈక్విటీ మూల ధనంపై రూ.5 ఇపి యస్ ఆర్జించనుంది. 2009-10 ఆర్థిక సంవత్స రంలో పెరిగిన స్టీల్ ధరల కు అనుగుణంగా లాభాల్లో కూడా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది. రెండు సంవత్సరాల ఫలితాలను విశ్లేషించి నటై్లతే కనీసంగా టన్నుకు రూ. 4,000 లాభం చేకూరుతుంది. దీనికి అదనంగా కార్బన్ క్రెడిట్స్ ద్వారా ఆ దాయం సమకూ రనుంది. విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యం, ముడి పదార్ధాల కొనుగోలులో ఉన్న జాగ్రత్త వడ్డీ తరుగుదల లాభాలను ప్రభావితం చేస్తాయి.
నేటి మేటి షేర్?
1. కార్బన్ క్రెడిట్ స్పాంజి ఐరన్ తయారీ బట్టీల నుంచి వెలువడుతున్న వ్యర్థ నీటి ఆవిరి ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తిని తయారుచేయడం వలన వార్షికంగా 59,000 కార్బన్ క్రెడిట్స్ చొప్పున రాబోయే 10 సంవత్సరాలు కార్బన్ క్రెడిట్స్ జమఅయ్యాయి. ఈ కార్బన్ క్రెడిట్స్ వలన వార్షికంగా 5 కోట్ల రూపాయల అదన పు లాభం చేకూరనుంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి 24 మెగావాట్ల నుండి 70 మెగావా ట్లకు పెంచుతున్న తరు ణంలో కార్బన్ క్రెడిట్స్ వలన ఒనగూరే ఆదాయం ఇంకా రెండింతలు పెరగనుంది. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో మొదటి విడతగా కార్బన్ క్రెడిట్స్ ెుుక్క ఆదాయాన్ని కంపెనీ పొందింది.
2. అత్యంత చిన్న ఈక్విటీ
58.1 కోట్ల అత్యంత చిన్న ఈక్విటీలో ప్రమోటర్లు 71.8% పైగా కలిగి ఉన్నారు. అందులో కార్పోరేట్ బాడీస్ 15.8% పైగా కలిగిఉన్నారు. ఇండియన్ పబ్లిక్ వద్ద 12.23% మాత్రమే ఉంది. అత్యంత తక్కువ పరిమాణంలో లభించనున్న ఈ షేరు చిన్న అభివృద్ధికే తన ధరలో విపరీత మైన పెరుగుదలను సూచిస్తుంది. 46.24 శాతానికి సమాన మైన షేర్లు భౌతిక రూపంలో ఉన్నందు వలన (ఫిజికల్ ఫార్మాట్) షేరు లభ్యత స్వల్పం. ఇది షేరు ధర పెరుగుదలకు దోహదం చేసే అంశం. కంపెనీ జిడిఆర్‌లు, ఎడిఆర్‌లు జారీ చేయనందున విదేశీ ఆర్థిక మాంద్య పరిస్థితులు కంపెనీపై ప్రభావాన్ని చూపించలేవు.
3. పుస్తక విలువ, ఇపియస్
2008-09 ఆర్థిక సంవత్స రంలో 48 కోట్లు నగదు లభ్య తను సంపాదించిన ఈ కంపెనీ 2009 -10 సంవత్సరంలో అదే విధంగా 48 కోట్లకు తక్కువ కాకుండా నగదు లభ్యతను ఆర్జించనుంది. 2010-11 సంవత్సరంలో విస్తరణ, సామర్థ్యం తో పాటు ఇనుము, ఉక్కు రంగాల్లో పెరు గుతున్న ధరలకు అనుగుణంగా నగదు లభ్యత కనీసం 60 కోట్లు తక్కువ కాకుండా ఉంటుంది. ఇది రూ.12 ఇపియస్‌తో సమానం. స్టీల్ రంగానికి ఉన్న పిఇని కనీసంలో కనీసంగా 8 గా లెక్కించి నటై్లతే షేరు ధర (రూ.128 =రూ.96) కనీసం రూ.100 ఉండాలి. ప్రస్తుతం పుస్తక విలు వ రూ.40 లకు సమానమైన మార్కెట్ ధర 40 రూపాయలకు అందుబాటులో ఉన్న ఈ షేరు రూ. 100 వరకు పెరగడా నికి అవకాశం ఉంది.
ముగింపు
1,28,000 టన్నుల స్ట్రక్చరల్ ఉత్పత్తి సామర్థ్యం, 4,27,000 టన్నుల వార్షిక స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి సామర్థ్యం, 42 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, 3 లక్ష ల టన్నుల పెల్లటైజే షన్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం, 4 కిలో మీటర్ల రైల్వే సైడింగ్, 3,83,625 టన్నుల కోల్ వాషరీ, 132 కెవిఎ లైన్ సొంత బొగ్గు గనులు, సొంత ఇనుప ముడి ఖనిజపు గనులు ఇవన్నీ కలిసి ఈ సమీకృత స్టీల్ ప్లాంటుకు అత్యంత తక్కువ వ్యయంతో స్టీల్‌ను ఉత్పత్తి చేసి మార్కెట్ చేయడానికి అనుకూలిస్తున్నాయి. అత్యంత చిన్న ఈక్విటీతో ఉన్న ఈ కంపెనీ మదుపరులకు 6నెలల కాలంలో ఆ ర్షణీయమైన లాభాలను ఆర్జించిపెట్టనుంది.
- డి. శివనాగేశ్వరావు
(ఇవి కేవలం సూచనలు మాత్రమే.సమగ్ర సలహాలకు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించగలరు.)
ఉత్పత్తి -వ్యయాలు
ఎమ్‌ఎస్ పి స్టీల్ 1,28,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో స్థాపించిన అత్యంత అధునాతనమైన స్ట్రక్చరల్ రోలింగ్ మిల్ వాణిజ్య ఉత్పత్తిని 22/04/2010 న ప్రారంభించింది. ఈ మిల్లులో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా బీమ్స్, ఛానల్స్, యాంగిల్స్, హెవీ మీడియం స్ట్రక్చరల్స్‌ను తయారుచేస్తుంది. ఎమ్‌ఎస్‌పి స్టీల్ ‘టీఎంటి’ బార్లను ‘ఎమ్‌ఎస్‌పి గోల్డ్ టీఎంటి’ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తుండగా ఈ స్ట్రక్చరల్స్‌ను ‘ఎమ్‌ఎస్‌పి గోల్డ్ స్ట్రక్చరల్స్’ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తుంది.
ఎమ్‌ఎస్‌పి స్టీల్ వివిధ రంగా ల్లోకి విస్తరించకుండా తనకు అనుభవం ఉన్న ఏకైక రంగం స్టీల్ రంగంలోనే తనదైన చెరగని ముద్రని వేసింది. స్టీల్ రంగంలో ముఖ్యంగా లాభాలు ఉత్పత్తి వ్యయం మీద ఆధారపడి ఉంటాయి. ముడి పదార్ధాలైన బొగ్గు, ముడి ఇనుప ఖనిజం, డోలమైట్ మరియు విద్యుత్ ధరలు ఫినిష్‌డ్ స్టీల్ ఉత్పత్తి వ్యయాన్ని ప్రభావితం చేస్తాయి. ముడి పదార్ధాల నిరం తర సరఫరా, రవాణా ఖర్చులు, ముడి పదార్ధాల లభ్యతపై ఫినిష్‌డ్ స్టీల్ ెుుక్క ఉత్పత్తి వ్యయం ఆధారపడి ఉంటుంది.
ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయ డానికి 1.6 టన్నుల ముడి ఇనుప ఖనిజం, 1.3 టన్నుల బొగ్గు, 50 కిలోల డోలమైట్ దాదాపు 3 లీటర్ల లైట్ డీజిల్ ఆయిల్ అవసరమవుతాయి. దీనికి అదనంగా విద్యుత్ ఖర్చు, కన్జుమబుల్స్, రవాణా ఛార్జీలు మరియు ప్రభుత్వపు పన్నులు అదనంగా చేరతాయి.
ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విజయం అనేది ముఖ్యంగా ముడిపదా ర్ధాల నిరంతర సరఫరా మరియు చౌక ధరకు కొనుగోలు చేయడం లోనే ఆధార పడి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ అనేది ముఖ్యంగా ముడిపదార్ధాల నిర్వహణే తప్ప మరేమీ కాదు.
ఎమ్‌ఎస్‌పి స్టీల్ ప్లాంట్ ప్రమోటర్లు ఈ సమస్యను అధిగమించడానికి ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో, ఛత్తిస్‌ఘడ్ ప్రభుత్వంతో, పశ్చి మబెంగాల్ ప్రభు త్వంతో, ఒరి స్సా ప్రభుత్వంతో, ఇనుప ఖని జం సరఫరాకి, బొగ్గు సరఫ రాకి, విద్యుత్ ఉత్పత్తికి ఎటు వంటి ఆటంకాలు కలుగ కుం డా ముందుగానే అవ గాహ న ఒప్పందాలు కుదుర్చు కొన్నా రు. దీనితో తమ జైత్ర యాత్ర కు మార్గం సులభమైంది.
విస్తరణ: విస్తరణలో భాగంగా ఎమ్‌ఎస్‌పి స్టీల్ 3 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో పెల్లటైజేషన్ ప్లాంటును మార్చి 2009లో ప్రారంభించింది. ఈ పెల్లటైజేషన్ ప్లాంటు ఇందనాన్ని పొదుపు చేయడం ద్వారా తక్కువ విద్యుత్ వ్యయంతో స్పాంజి ఐరన్‌ను తయారుచే స్తుంది. ఇందుకు కావలసిన సాం కేతిక పరిజ్ఞానాన్ని ఎమ్‌ఎస్‌పి స్టీల్ సొంతంగా అభివృద్ధి పరిచింది. ప్రస్తుతం బట్టీల నుంచి వెలు వడే వ్యర్థ వేడి నీటి ఆవిరిని ఉపయోగించి 16 మెగావాట్ల విద్యుత్‌ను, కోల్ వాషరీ నుంచి వెలువడే వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి 8 మెగావాట్ల విద్యుత్‌ను తయారుచేస్తున్నారు. ఈ 24 మెగా వాట్ల సామర్థ్యాన్ని 70 మెగావాట్లకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసారు.
భవిష్యత్ ప్రణాళికలు
1. బొగ్గు గని
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ రాబోయే 30 సంవత్స రాల్లో ఈ కంపెనీ బొగ్గు అవసరాలను తీర్చడానికి ఛత్తీస్‌ఘడ్‌లోని బొగ్గు గనిని కేటాయిం చింది. ఈ ఆర్థిక సంవత్సరం 2010-11 లోనే ఈ బొగ్గు గని నుండి త్రవ్వ కాలను ప్రారంభించనుంది. దీని వలన కంపెనీ తక్కువ ఉత్పత్తి వ్యయంతో స్టీల్‌ను ఉత్పత్తి చేయగలుగుతుంది.
2. సిమెంట్ యూనిట్
అక్టోబర్ 27, 2007 సంవత్స రంలో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో సిమెంట్ యూనిట్‌ను స్థాపించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు గాను కత్ని జిల్లాలో 683.47 హెక్టార్లలో సున్నపు రాయిని వెలికితీయ డానికి ప్రాస్‌పెక్టివ్ లైసెన్స్‌ను పొందింది.
3. ఐరన్ ఓం్ బెనిఫికేషన్ ప్లాంట్
ఫిబ్రవరి 16 2008 న 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో ఒక్కొ క్కటి 5 మిలియన్ టన్నుల వార్షిక సామ ర్థ్యంతో జబల్‌పూర్ జిల్లాలోను మరియు కత్ని జిల్లాలోను రెండు ఐరన్ ఓం్ శుద్ధీక రణ ప్లాంట్లను స్థాపించడానికి మధ్యప్ర దేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
4. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రూ. 2,500 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో 2 మిలియన్ టన్నుల ఇంటి గ్రేటెడ్ స్టీల్ ప్లాంటును సొంత అవసరా లకు 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును స్థాపించడానికి 30 జూలై 2008 న అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
5. థర్మల్ పవర్ ప్రాజెక్ట్
4,200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో 1,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించడానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వంతో జూలై 30, 2008 న అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకుంది.
6. సిమెంట్ యూనిట్స్ - ఛత్తీస్‌ఘడ్
ఆగష్టూ 7, 2008 సంవత్స రంలో 1.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో సిమెంట్ ప్లాంటును మరియు 50 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును స్థాపించడానికి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
7. ఐరన్ ఓం్ - ఛత్తీస్‌ఘడ్
ఛత్తీస్‌ఘడ్ లోని దుర్గ కొండ అటవీ ప్రాంతంలో 150 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజాన్ని వెలి కితీయడానికి డిసెంబర్ 22, 2008 న ప్రాస్‌పెక్టివ్ మైనింగ్ లైసెన్స్ లభించింది.
8. రాయపూర్ విస్తరణ
కంపెనీ 180 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో విస్తరణను చేప ట్టిం ది. విస్తరణలో భాగంగా స్పాంజి ఐర న్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,15,500 టన్నులకు పైగా పెంచనుంది. విస్తరణా నంతరం కంపెనీ 4,27,000 టన్నుల వార్షిక స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా బాయి లర్ కెపాసిటీని పెంచి అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయబోతుంది. విస్తరణానం తరం కంపెనీ 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విస్తరణలో భాగంగా రైల్వే సైడింగ్‌ను 4 కిలో మీటర్లకు పొడిగించనుంది. విస్తరణకు కావలసిన 180 కోట్ల రూపా యలలో నాలుగు బ్యాంకుల కన్జార్షియం యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిబిజె యునై టెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పోరేషన్ బ్యాంక్ 120 కోట్లను సమ కూర్చగా మిగిలిన 60 కోట్లను అంతర్గత వనరుల నుంచి సమీకరించారు.


