Saturday, April 24, 2010

కొత్త రూపుతో మారుతీ వాగన్‌-ఆర్‌ విడుదల

న్యూఢిల్లీ: దేశ అతిపెద్ద ఆటోమోబైల్‌ ఉత్పత్తి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తమ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కార్‌ ’వాగన్‌-ఆర్‌’ను కొత్త రూపుతో మార్కెట్లోకి పునర్విడుదల చేసింది. కే-సీరీస్‌ ఇంజన్‌ (కె10బి)తో ఏ-స్టార్‌ మోడల్‌ తరహాలోనే ఉన్న 68పీఎస్‌ యూనిట్‌ను కొత్త వాగన్‌-ఆర్‌లో అమర్చారు. సంస్థ గుర్‌గావ్‌ కేంద్రం ద్వారా వాగన్‌-ఆర్‌ మోడల్‌ కారు ఉత్పత్తి జరుగుతుందని, భారత్‌ స్టేజ్‌-4 నియమాల అనుగుణంగా కొత్త వాగన్‌-ఆర్‌ను రూపొందించామని సంస్థ తెలిపింది. కొత్తగా మళ్ళీ విడుదలైన వాగన్‌-ఆర్‌ ద్వారా మారుతీ సంస్థ పరిశోధన వృద్ధితో పాటు వృద్ధి చెందిన సామర్థ్యాలు తెలియ చేస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ షిన్‌జో నకానిషి అన్నారు. జపాన్‌లోగల కొత్త వాహన ప్లాట్‌ఫాంపై రూపుదిద్దుకున్న వాగన్‌-ఆర్‌ కే-సీరీస్‌ ఇంజన్‌తో పాటు 998సీసీ ఇంజన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రూ.3.28 లక్షల నుండి రూ.3.81 లక్షల వరకూ కొత్త వాగన్‌-ఆర్‌ ధరను నిర్ణయించారు.

వాగన్‌-ఆర్‌ రాకతో కాంపాక్ట్‌ కారు ధరలు పెంచేసిన ఆటో సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వాగన్‌-ఆర్‌ను విడుదల చేసిన వెంటనే ఇతర వాహన ఉత్పత్తుల సంస్థలు తమ వాహన ధరలను కాంపాక్ట్‌ కార్ల విభాగంలో పెంచేశాయి. కొత్తగా విడుద లైన వాగన్‌-ఆర్‌ ధర రూ.3.28-3.81 లక్షల మధ్యన కాంపాక్ట్‌ కార్‌ విభాగంలో అత్యంత గరిష్ఠం గా పలుకుతోంది. ఈ మధ్యకాలంలో కొత్తగా విడుదలైన కాంపాక్ట్‌ కార్లలలో చెవర్లె బీట్‌ రూ.3.41 లక్షల నుండి 4.43 లక్షలుగా పెరిగింది. ఈ వరుసలో ఫోర్డ్‌ ఫిగో రూ.3.49 లక్షల నుండి 3.99 లక్ష లుగా, హుండాయ్‌ ఐ10 ధర రూ.3.47 లక్షల నుండి 3.83 లక్షలుగా పెరిగాయి.

ఆల్టో మోడల్‌ తరువాత మారుతీ సంస్థకు అత్యంత గరిష్ఠ విక్రయాలను నమోదు చేసే వాగన్‌-ఆర్‌ మోడల్‌ విష యంలోమారుతీ సుజుకీ సంస్థ ఈ విభాగంలో గట్టి పోటీను ఇవ్వనున్న ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌, హుండాయ్‌ సంస్థలు రేసులో ఉన్నా కొత్త వాగన్‌-ఆర్‌ విడుదలతో మారుతీ సంస్థ ఆత్మవిశ్వాసం కనబరుస్తుంది. గత ఏడాది విక్రయాల్లో రెండవ ఉత్తమ కారుగా వాగన్‌-ఆర్‌ ప్రతి మాసంలో సుమా రు 10,000-12,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందని మారుతీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, విక్రయాలు) మయాంక్‌ పరీఖ్‌ అన్నారు. పాత మోడల్‌ వాగన్‌-ఆర్‌ కన్నా కొ త్తగా విడుదలైన వాగన్‌-ఆర్‌ ధరల విషయంలో కాస్త అధికంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.