Friday, April 23, 2010

ఆయిల్‌ ఇండియాకు నవరత్న హోదా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఆయిల్‌)కు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందువల్ల కంపెనీ బోర్డుకు మరిన్ని అధికారాలు దఖలు పడతాయి. పెట్రోలియం, సహజవాయువు శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని 'ఆయిల్‌' ఒక ప్రకటనలో తెలిపింది. నూతన హోదా వల్ల రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులు, లేదా ఇతర కంపెనీల స్వాధీనత కోసం ప్రభుత్వ అనుమతి కోరనవసరం లేదు. ఈ హోదా వల్ల అంతర్జాతీయ అగ్రశ్రేణి సంస్థల సరసన సత్తా చాటేందుకు 'ఆయిల్‌'కు అవకాశం దక్కింది. మరింత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు ఉపకరిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలో మొత్తం 19 కంపెనీలకు నవరత్న హోదా ఉంది.