Thursday, April 22, 2010

అన్‌లిస్టెడ్ కంపెనీలకూ సెబి నిబంధనల వర్తింపు

న్యూఢిల్లీః కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి లిస్టెడ్ కంపెనీలకు ఉద్దేశించిన సెబి నియమనిబంధనలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు కూడా వర్తింపజేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్త కంపెనీల బిల్లులో ప్రతిపాదనలు చేయనున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సాల్మన్ ఖుర్షీద్ తెలిపారు. ఉత్తమ నిర్వహణ విధానాలను అందరూ పాటించాల్సిందేనని అసోచామ్ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూకు రాని కంపెనీలు సైతం బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్లను చేర్చుకోవల్సి ఉంటుంది.