
కుల్ఫీ... తడారిపోయిన గొంతునే కాదు వేసవి ఉక్కపోతతో విసిగిపోయిన మనసునీ హాయిగా పలకరిస్తుంది. వేడి గాలుల్లో చల్లని పిలుపులా ... తింటుంటే అయ్యో అప్పుడే కరిగిపోయిందా కుల్ఫీ అనిపిస్తుంది. అందుకే ఇక నుంచి మీ ఫేవరిట్ వేసవి సాయంకాలాలకు మల్లెలు... మామిడిపండ్లు.. ఐస్‌క్రీంలతో పాటు కుల్ఫీలను జతచేసుకోండి. తిని మజా చేసుకోండి.

తయారీ: పాలను మందపాటి పాత్రలోకి తీసుకొని మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ సగం అయ్యే వరకు వేడిచేయాలి. ఇందులో పంచదార, యాలకులపొడి, కోవా వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక స్టవ్ కట్టేయాలి. చల్లారాక మిక్సీలో రెండు నిమిషాలు తిప్పి.. వేయించిన జీడిపప్పు పలుకులు చేర్చి మిశ్రమాన్ని వెడల్పాటి పాత్రలోకి మార్చుకోవాలి. ఎనిమిది గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. తీయతీయని కోవా కుల్ఫీ సిద్ధం.

తయారీ: కండెన్స్‌డ్ మిల్క్, క్రీం ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి. ఇందులో కోకోపొడి, వేయించిన జీడిపప్పు వేయాలి. దీనిని కుల్ఫీ మౌల్డ్‌లో గాని, పొడవాటి గ్లాసులో గాని తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టాలి. గట్టిపడ్డాక మిక్సీలో వేసి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. బాగా గట్టిపడ్డాక.. మౌల్డ్‌ను తిరగేస్తే చాలు.. కమ్మని చాక్లెట్ కుల్ఫీ సిద్ధం.

తయారీ: సేమియా మినహా మిగిలినవన్నీ ఒక పాత్రలోకి తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మౌల్డ్‌లోకి తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టి గట్టిపడిన తరవాత మిక్సీలో వేయాలి. ఇప్పుడు సేమియా కూడా చేర్చి.. మళ్లీ మౌల్డ్‌లోకి తీసుకొని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎనిమిది గంటల తరవాతతయారైన కుల్ఫీని కప్పులో సర్వ్ చేస్తే చాలు.

తయారీ: పాలను మందపాటి పాత్రలోకి తీసుకొని సగం అయ్యేంతవరకు మరిగించాలి. ఇందులో పంచదార, మామిడిపండు గుజ్జు, యాలకులపొడి వేసి బాగా కలపాలి. చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొడుగాటి పాత్రలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచితే చాలు. ఆ తరవాత చిన్నచిన్న కప్పులో సర్వ్ చేస్తే.. నోరూరడం ఖాయం.

తయారీ: మందపాటి పాత్రలో పాలు తీసుకుని సన్ననిమంటపై ఉంచాలి. మధ్యమధ్యలో కలుపుతూ సగం అయ్యే వరకు మరిగించాలి. ఇందులో పంచదార, క్రీం, రవ్వ, మొక్కజొన్న పిండి చేర్చాలి. తరవాత బాదం, పిస్తా వేడి నీటిలో అరగంట నాననిచ్చి పొట్టు తీసి పలుకుల్లా చేయాలి. వీటితోపాటు కుంకుమపువ్వు రేకలను కూడా చల్లారిన పాలలో వేసి పొడుగ్గా ఉన్న పాత్రలోకి తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎనిమిది గంటల తరవాత తీస్తే బాదం, పిస్తా కుల్ఫీ తయార్.
