Monday, April 26, 2010

బిజినెస్‌ గారడీలు

* చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు
ఐపీ పెట్టినా ఓవర్‌డ్రాఫ్ట్‌ అడిగినట్లు

* అడగందే అమ్మ అయినా పెట్టదు
అడగందే లోన్‌ అయినా పుట్టదు

* సొమ్ముకడిది- సోకొకడిది
(బ్యాంకు) ఫిక్స్‌డ్‌ డిపాజిటొకరిది- లోనొకరిది

* ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్లు
ఫోర్బ్స్‌ జాబితాకెక్కి చాప్టర్‌ 11 (దివాలా)కు దరఖాస్తు పెట్టినట్లు

* ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నట్లు
జుత్తును చూసి షాంపూ పేరేంటని అడిగినట్లు