Monday, April 26, 2010

ఆధునిక వర్టికల్ ఇటుక బట్టీలు

దేశంలో లక్షకు పైగా మట్టితో తయారు చేసే ఇటుక బట్టీలు ప్రతి ఏడాది 12 వేల కోట్లకు పైగా ఇటుకలను తయారు చేస్తున్నాయి. వీటి మార్కెట్ పరిమాణం 5 వేల కోట్ల రూపాయలు. స్థిరంగా, మార్చుకోవడానికి అవకాశం ఉండే పొగ గొట్టం ఉండే బుల్ ట్రెంచ్, హాఫ్‌మన్ సొరంగం బట్టీలు, ఓపెన్ క్లాంప్, వర్టికల్ షాఫ్ట్ వంటివి ఇటుక బట్టీలలో రకాలు. ప్రతి ఏడాది ఇటుకలను కాల్చడానికి వినియోగిస్తున్న బొగ్గు 25 మిలియన్ టన్నులు కాగా కట్టెలు 3 లక్షల టన్నులు. వీటి ద్వారా ఏడాదికి 60 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు వెలువడుతుంది. ఈ వాయువు వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

ఇటుక బట్టీలపై కొత్త నిబంధనలు
ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిగణనలోకి తీసుకొని అటవీ శాఖ ఇటుక బట్టీల ఏర్పాటుకు సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. అవి:
n ఇటుక బట్టీ ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ అనుమతి తప్పని సరి
n వ్యవసాయ భూమికి కనీసం 50 మీటర్లు, నదులు, కాలువలకు కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి.
n జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు కనీసం 200 మీటర్లు, గ్రామీణ రహదారిలో 25 మీటర్ల దూరంలో ఉండాలి.
n బూడిదను నిత్యం తొలగించాలి. n బట్టీలకు పరిశ్రమల శాఖ అనుమతి తప్పని సరి
n జనావాసాలకు కనీసం కిలోమీటర్ దూరంలో ఉండాలి.

ఆధునిక ఇటుక బట్టీలు
దక్షిణాదిరాష్ట్రాల్లో అధికంగా ఓపెన్ క్యాంప్ బట్టీలే ఉన్నాయి. వీటి నుంచి వెలువడే పొగ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. వీటి స్థానంలో తక్కువ పొగతోపాటు దాదాపు పదిహేనేళ్ల పాటు వినియోగించే అవకాశం ఉన్న వర్టికల్ షాఫ్ట్ ఇటుక బట్టీల ఏర్పాటు ఎంతో ప్రయోజనకరం.

వర్టికల్ బట్టీల ప్రయోజనాలు n సంప్రదాయ బట్టీలు ఏడాదికి 9 నెలలు ఉత్పత్తి చేస్తే.. వర్టికల్ బట్టీలు ఏడాదంతా ఉత్పత్తి చేస్తాయి.
n సాధారణ బట్టీలో ఇటుకలను కాల్చడానికి పట్టే కాలం 7 రోజులు. వర్టికల్ బట్టీలలో కేవలం 24-30 గంటల సమయం పడుతుంది.
n సాధారణ బట్టీలలో వినియోగించే బొగ్గు, కర్రలతో పోల్చితే 40-50 శాతం ఆదా ఉంటుంది.
n ఆధునిక బట్టీలలో పొగ కూడా తక్కువ వస్తుంది.
n 10-15 సంవత్సరాల పాటు ఇటుకలు కాల్చవచ్చు. నాణ్యమైన ఇటుకలు తయారు చేయవచ్చు. నిర్వహణ వ్యయం తక్కువ. n ఆధునిక ఇటుక బట్టీలు నిటారుగా నిర్మిస్తారు కాబట్టి తక్కువ స్థలం అవసరం ఉంటుంది.
స్థాపన వ్యయం: రోజుకు 8,000 ఇటుకలను తయారు చేసే పరిశ్రమ అంచనా వ్యయం 22 లక్షల రూపాయలు.