మూడో వంతు రన్‌వేపైకి...
తగ్గుముఖం పట్టిన బూడిద
మరో మేఘం ముప్పు: నిపుణులు

* మరో బూడిద మేఘం బ్రిటన్‌కు దక్షిణ, తూర్పు దిక్కుల్లో ఏర్పడుతోందని సోమవారం రాత్రి అధికారులు ప్రకటించారు.
* ఐరోపాలోని మొత్తం 28వేల విమానాల్లో సోమవారం 9వేల విమానాలు తిరిగాయి.
* ఈ వారం రోజుల్లో విమానయాన రంగానికి మొత్తం రూ.13,500 కోట్లు నష్టం వచ్చిందని అంచనా వేశారు.
* దక్షిణ కొరియాలోని సియోల్ విమానాశ్రయంలో ఐరోపాకు ఎగుమతి కావాల్సిన వస్తువులన్నీ మూలుగుతున్నాయి. ఇందులో కంప్యూటరు చిప్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెమి కండక్టర్లు ఉన్నాయి.
* వ్యాపారవేత్తలు, క్రీడాకారులు సుదూర ప్రయాణాలకు కార్లను వినియోగించాల్సి వస్తోంది.
* కంపెనీలు సమావేశాల కోసం వీడియో కాన్ఫరెన్సులను ఆశ్రయిస్తున్నాయి.
* దాదాపుగా 1.5 లక్షల మంది బ్రిటిషర్లు విదేశాల్లో ఇరుక్కుపోయారు.
* ఐరోపాలో 40వేల మంది అమెరికన్లు చిక్కుకుపోయారు.
* భారత్‌లో చిక్కుకుపోయిన వీసా గడువు ముగిసినవారు ప్రయాణం ప్రారంభమయ్యేవరకూ ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటి ఛార్జీలు లేకుండా 14 రోజుల వరకూ ఉండేందుకు అనుమతించింది.
ఎంత కష్టం...
బ్రిటిష్ వ్యాపారవేత్త క్రిస్ థామస్ కష్టం చూస్తే మనకు విమాన ప్రయాణికుల ఇబ్బందులు కళ్లకు కడతాయి. ఆయన లాస్ ఏంజెలెస్ నుంచి బ్రిటన్‌లోని వేల్స్ రావడానికి వారం పట్టింది. గత గురువారం ఆయన మొదట మెక్సికో సిటీకి విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి మాడ్రిడ్‌కు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి దాదాపుగా రూ.లక్ష చెల్లించి 14 గంటలు ప్రయాణించి కారులో పారిస్ చేరుకున్నారు. అక్కడి నుంచి సొరంగ రైలులో లండన్‌కు వచ్చారు. లండన్ నుంచి మరో నాలుగు గంటలు ప్రయాణించి ఆయన వేల్స్ చేరుకోవాల్సి వచ్చింది.