Thursday, April 22, 2010

మార్కెట్‌ను వేడెక్కనీయం - దువ్వూరి

న్యూఢిల్లీ: మార్కెట్లో అననుకూల పరిస్థితులను చక్కదిద్దడానికి, ద్రవ్యోల్బ ణాన్ని కట్టడి చేయడానికి మాత్రమే రిజర్వ్‌ బ్యాంకు చర్యలు తీసుకుంటున్నదని, తమ నిర్ణయాల కారణంగా ద్రవ్య మార్కెట్‌ను వేడెక్కనీయమని ఆర్‌బిఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారు. మంగళవారం వార్షిక ద్రవ్య విధాన సమీక్షను నిర్వహించిన అనంతరం బుధవారం ఆయన ఆర్ధిక విశ్లేషకులతో టెలీ కాన్ఫరెన్స్‌ జరిపారు. సరఫరా వైపు ఏర్పడుతున్న ఒత్తిళ్ళను అధిగమించడానికి తాము కృషి చేస్తున్నామని, ద్రవ్యోల్బణం పది శాతానికి చేరువవుతున్నప్పటికి భయపడాల్సిన పని లేదని, ఆహారోత్పత్తుల సరఫరాకు ఇబ్బంది ఉండదని చెప్పారు.

సమావేశంలో పాల్గొన్న ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ సుబీర్‌ గోకర్ణ్‌ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిని కాపాడుతూ, ద్రవ్యోల్బ ణాన్ని కట్టడి చేస్తూ, ప్రైవేట్‌ రంగ అవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం అనే మూడు అంశాలు ఎపెక్స్‌ బ్యాంక్‌ సవాళ్ళుగా పరిణమించాయని, వీటిని దృష్టిలో పెట్టుకునే సిఆర్‌ఆర్‌, రెపో, రివర్స్‌ రెపో రేట్లను సమతౌల్యాన్ని సాధిస్తూ 25 బేసిక్‌ పాయింట్లకు పెంచడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం మార్కెట్‌ నుండి 4.57 లక్షల కోట్లను సమీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది గత ఏడాది కంటే రూ.ఐదు లక్షల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం.

తగ్గనున్న రుణ రేటు:
గత ఏడాది ఏప్రిల్‌ 9 నాటికి వాణిజ్య బ్యాంకుల ఇచ్చే రుణాలు 18.1 శాతం ఉండగా, ఈ ఏడాది ఇదే కాలానికి అది 16. 8 శాతానికి తగ్గింది. ఈ ఏడాది రుణ రేటును 20 శాతానికి తీసుకుపోవాలనేది ఆర్‌బిఐ ల క్ష్యంగా ఉంది. ఈ ఏ డాది ఏప్రిల్‌ నాటికి వాణిజ్య బ్యాంకులు మొత్తం 33.34 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి. ఇది గత ఏడాది ఇదే కాలానికి రూ. 28.54 కోట్లుగా ఉంది. ఆర్‌బిఐ ఆశించిన 16 శాతం రుణ రేటు కంటే ఎక్కువ. బ్యాం కులు ఆహారేతర రంగానికి ఇచ్చిన రుణం 20 శాతంగా ఉంది. అయితే ఇది ల క్ష్యంగా గాక, ఆయా రంగాలకు సంబంధించి ప్రొజెక్షన్‌గా భావించాలని ఆర్‌బి ఐ పేర్కొంది. రానున్న రోజుల్లో రుణ వృద్ధి రేటు 20-22 శాతానికి పెరగవ చ్చు నని, మౌలిక రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, తదనుబంధ రంగాల లో కనిపిస్తున్న జోరు అందుకు కారణం కావచ్చునని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త ధర్మకృతి జోషి పేర్కొన్నారు.