Tuesday, April 20, 2010

దారులన్నీ బంద్ ...విమానాశ్రయాల్లో లక్షల్లో ప్రయాణీకులు

నౌకల్లో తరలింపునకు బ్రిటన్ ఏర్పాట్లు
ఐఎటిఏ ఆగ్రహం

లండన్ : యూరోపియన్ గగనతలంపై ఇంకా ధూళి మేఘాలు వీడక పోవ టంతో వరుసగా ఐదో రోజు విమాన సర్వీసులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించటంపై విమానయాన సంస్థలు అన్ని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు విదేశీ విమానాశ్రయాల్లో చిక్కుకు పోయిన 1.5 లక్షల మంది ప్రయాణికులను స్వస్థలాలకు తర లించటానికి నావికాదళానికి చెందిన నౌకలను వినియోగించనున్నట్లు బ్రిటన్ తెలిపింది. విమానాశ్రయాలను ఒక్కసారిగా మూసివేయటంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులెదుర్కొంటున్నారని విమాన సంస్థలు యూరోపియన్ రవాణా శాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

రోజుకు 28 వేల విమానాలు ప్రయాణించాల్సి ఉండగా సుమారు 8 వేల నుంచి 9 వేల విమానాలు మాత్రమే నడిచినట్లు యూరో కంట్రో ల్ వెల్లడించింది. ప్రభు త్వాలు తమతో ఎలాంటి సమన్వయం, చర్చలు చేపట్టకుండా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వాస్తవి కాంశాలను పక్కనబెట్టి సిద్ధాంత పరంగా యూరోపియన్ ఎయిర్ స్పేస్ ఈ మూసివేత నిర్ణయం తీసుకుందని ఐఎటిఎ పేర్కొంది.

నావికాదళ నౌకలను ఉపయోగిస్తాం
బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం విదేశీ విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన బ్రిటన్ ప్రయాణికులను స్వస్థలాలకు తీసుకురావటానికి హెచ్ఎంఎస్ ఆర్క్ రాయల్, హెచ్ఎంఎస్ ఓషియన్ వంటి నావికా దళానికి చెందిన నౌకలను వినియోగించనున్నట్లు తెలిపారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ విమానాశ్రయంపై ధూళి మేఘాల ప్రభావం లేదని, ఆసియా, ఆఫ్రికా సహా యుఎస్‌ల నుంచి తిరిగి రానున్న బ్రిటన్ ప్రజల కోసం దీన్ని హబ్‌గా ఉపయోగించుకోనున్నట్లు బ్రౌన్ పేర్కొన్నారు.

రైల్వే, బస్ లేదా ఇతర మార్గాల ద్వారా స్పెయిన్‌కు చేరుకున్న బ్రిటన్ పౌరులను నౌకల ద్వారా స్వదేశాలకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. పశ్చిమ యూరప్‌లోని అన్ని ప్రధాన ఎయిర్‌పోర్టులు ఇప్పటికింకా మూసివేసే ఉండగా స్వీడన్, రొమేనియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్‌లు స్వల్పంగా సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నాయి.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు
యూరోపియన్, ఉత్తర అమెరికా నగరాలకు విమాన సర్వీసులు నిలిచిపోవటంతో ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో 41,435 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ శుకుల్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన కార్యదర్శి ఎం.మాధ వన్ నంబియార్ తెలిపారు. యుఎస్‌కు ఏథెన్స్, ఈజిప్ట్‌ల మీదుగా ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులను ప్రారంభించినప్పటికీ ఇంకా పరిస్థితి కుదుటపడలేదని ఆయన పేర్కొన్నారు. ఎయిరిండియా విమానాలు ఐదు లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, చికాగో, న్యూయార్క్ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయినట్లు నంబియార్ తెలిపారు.

యూర ప్ విమానాల రద్దు
యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్‌లు వెల్లడిం చాయి. యుఎస్, కెనడా సర్వీసులను ఇతర మార్గాల ద్వారా నడిపిస్తు న్నట్లు ఎయిరిండియా తెలిపింది. ముంబై-న్యూయార్క్, ఢిల్లీ- టొరం టో విమానాలను గ్రీస్ మీదుగా నడుపుతున్నట్లు జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది. ఇదిలా ఉండగా యూరోపియన్ దేశాలకు ప్రయా ణాలు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం ప్రయాణికులకు సూచించింది.