
ఎప్పుడు,ఎక్కడ: శుక్రవారం, న్యూఢిల్లీలో
ధరలు: రూ.3.28 లక్షలు; ఎల్‌ఎక్స్‌ఐ వర్షన్ రూ.3.57 లక్షలు; వీఎక్స్‌ఐ వర్షన్ రూ.3.81 లక్షలు(ఎక్స్ - షోరూమ్ న్యూఢిల్లీలో)
ఎవరు : సంస్థ సీఈఓ, ఎండీ షింజో నకనిషి విడుదలచేశారు.
ఏమన్నారు: 'సరికొత్త బ్రాండ్‌గా ఈ కారును మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాం.. కారు లోపలి భాగాల అమరిక ఆహ్లాదకరమైన శైలిలో ఉంటుంది. కె-సిరీస్ ఇంజిన్ పర్యావరణ అనుకూలంగా, అదనపు ఇంధన సామర్థ్యంతో పనిచేస్తుంది. పరిశోధన - విభాగంలో కంపెనీ చేస్తున్న కృష్టికి ఇదొక ఆనవాలుగా నిలుస్తుంది. ఏ2 వాహన విభాగంలో మారుతీ సుజుకీ మార్కెట్ వాటా మరింత పెరిగేందుకు న్యూ వ్యాగన్ ఆర్ ఊతమిస్తుందని విశ్వసిస్తున్నాం.'
ప్రత్యేకతలు: లీటరుకు 18.9 కిలోమీటర్ల మైలేజీనిచ్చే బీఎస్-4 ప్రమాణాలతో కూడిన 998 సీసీ కె-సిరీస్ ఇంజిన్; అద్భుతమైన సస్పెన్షన్ టెక్నాలజీ; కేబుల్-టైప్ గేర్ షిఫ్ట్; దీని మొత్తం పొడవును 75 ఎం.ఎం మేర పెంచి 3,595 ఎం.ఎంలకు విస్తరించారు.. వీల్ బేస్ పొడువు 2,400 ఎం.ఎం; కంపెనీకి చెందిన ఏ2 వాహన విభాగంలో ఇదే పొడవైన, ఎత్త్తెన కారు.